UP Businessman Raided By I-T Dept, Rs 150 Crore Found in Cash వ్యాపారి ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన ఐటీ అధికారులు..

Cbic unearths rs 150 cr cash from businessman piyush jains residence in kanpur

businessman, tax raids, Piyush Jain, perfume trader, IT officials, Income Tax Sleuths, Goods and Services Tax (GST), Kanpur, Uttar Pradesh, Crime

Cash worth Rs 150 crore has been found so far during Income Tax raids on premises linked to Kanpur businessperson Piyush Jain. The I-T raids, which began on Thursday, 23 December, are still underway at the house, factory, office, cold store, and petrol pump linked to Jain in Kanpur, Kannauj, Mumbai, and Gujarat.

వ్యాపారి ఇంట్లో నోట్ల గుట్టలు.. షాకైన ఆదాయపన్ను శాఖ అధికారులు..

Posted: 12/24/2021 06:31 PM IST
Cbic unearths rs 150 cr cash from businessman piyush jains residence in kanpur

ఎన్నికల వేళ.. రాజకీయనాయకులకు అత్యంత సన్నిహితులైన వారివద్ద డబ్బుల కట్టలు లభ్యమవుతాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో.. ఓ వ్యాపారవేత్త.. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత, అఖిలేష్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడైన నేత ఇంటిపై ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఇళ్లంతా వెతికేసీ ఏమీ లభించక వెళ్లిపోదామనుకుంటున్న తరుణంలో ఇంట్లోని రెండు అల్మారాల్లో నోట్ట కట్టలు కనిపించడంతో అధికారులు షాక్ అయ్యారు.

ఎస్పీ పార్టీ సమావేశంలో ఓ సెంటును అవిష్కరించడంతో ఆదాయపన్ను స్కానర్ లో పడ్డారన్న విమర్శలు వస్తున్న వేళ.. ఆయన ఇంటిపై పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు దాడులు చేసిన సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో కనిపించిన నోట్ల గుట్టలను లెక్కిస్తే ఏకంగా రూ.150కోట్లకు పైనే తేలింది. నిన్న‌టి నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వ‌హిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 150 కోట్ల న‌గ‌దును ఐటీ అధికారులు లెక్కించారు. ఇంకా కౌంటింగ్ కొన‌సాగుతూనే ఉంద‌ని తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రాగా, ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపి ఏమీ లభించలేదని తిరిగి వెళ్లేందుకు సిద్దమతున్న తరుణంలో.. అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్‌ చేసిన కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి బ్యాంక్‌ అధికారులను దింపి నోట్ల కట్టలను లెక్కించారు.

కాగా క్రితం రోజు సాయంత్రం నుంచి ఈ లెక్కింపు కొనసాగగా.. శుక్రవారం ఉదయం నాటికి రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. వామ్మో అనుకున్న జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ సొమ్మును నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. ఊహాజనిత కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. పీయూష్‌ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

ఓ వేర్‌హౌస్‌లో 200 నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి పీయూష్ జైన్‌.. స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్‌కు అత్యంత స‌న్నిహితుడు. స‌మాజ్‌వాదీ పార్టీ పేరు మీద ఓ బ్రాండ్ ప‌ర్‌ఫ్యూమ్ కూడా త‌యారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాడు పీయూష్ జైన్‌. అయితే పీయూష్ జైన్ ఇంట్లో డ‌బ్బులు లెక్క‌పెడుతున్న దృశ్యాల‌ను బీజేపీ నేత సంబిత పాత్ర ట్వీట్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అవినీతి వాసన అంటూ.. ఆయన చేసిన ట్వీట్.. అందులో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles