RTI activist attacked, legs pierced with nails ఆర్టీఐ కార్యకర్తను అపహరించి.. కాళ్లలో మేకులు దింపి చిత్రహింసలు

Liquor mafia attacks rti activist who had complained about the sale of illicit liquor

Rajasthan RTI, Rajasthan RTI activist beaten, RTI activist beaten, Rajasthan RTI activist beaten up, RTI activist beaten, Barmer RTI activist, RTI activist Amra Ram Godara, Rajasthan RTI activist beaten, Pareyu village, Barmer district, state HRC, illegal liquor, Liqour Mafia, Rajasthan, Crime

An RTI activist was beaten up and his legs pierced with nails by a group of unidentified assailants in Barmer district of Rajasthan. Amra Ram Godara was attacked in his native Pareyu village and is in a critical condition. He had recently lodged a police complaint against illegal liquor trade, they said.

మద్యం మాఫియా దాష్టికం.. ఆర్టీఐ కార్యకర్తను అపహరణ.. కాళ్లలో మేకులు దింపి చిత్రహింసలు

Posted: 12/24/2021 01:05 PM IST
Liquor mafia attacks rti activist who had complained about the sale of illicit liquor

రాజస్థాన్‌లో అమానవీయ ఘటన జరిగింది. అక్రమార్జనకు అలవాటు పడిన మద్యం మాఫియా.. తమపై ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్తను దారుణంగా హింసించారు. అతడు మరణించాడని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. తమ అక్రమాలకు అడ్డువస్తున్నాడని భావించిన మద్యం మాఫియా ముఠా సభ్యులు.. తమ అనుచరులచేత వారిపై పిర్యాదు చేసిన అర్టిఐ కార్యకర్తను అపహరింపజేసి.. దారుణంగా హించించారు. కాళ్లు చేతులు మెలియ తప్పి విరగోట్టారు. కాళ్లలో మేకులు కొట్టారు. తమ అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. వాటిపై అటు పోలీసులకు, ఇటు అధికారులకు పిర్యాదు చేస్తున్నందున ఈ దారుణానికి ఒడిగట్టారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రాజస్థాన్ లో జరిగింది. మద్యం మాఫియా ఇంతలా వేళ్లూనుకుందంటే.. అక్కడి ప్రభుత్వ అధికారులతో పాటు పలువురు పెద్దల అండదండలు కూడా మెండుగా వుంటాయన్న అరోపణలు వినబడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే... బార్మర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల అమ్రారామ్ గోద్రా ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన మద్యం మాఫియా ఈ నెల 21న ఆయనను అపహరించింది. ఆపై ఇనుపరాడ్లతో ఆయనపై దాడిచేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. అనంతరం రెండు కాళ్లలో మేకులు దిగ్గొట్టారు. ప్రస్తుతం జోధ్‌పూర్ ఆసుపత్రిలో ఉన్న గోద్రా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఆర్టీఐ ద్వారా గోద్రా పోలీసులు, ఇతరులకు సమాచారం అందించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు. ఆసుపత్రికి వెళ్లిన ఏఎస్పీ.. గోద్రాను పరామర్శించినట్టు చెప్పారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు. కారులో వచ్చిన 8 మంది దుండగులు గోద్రాను అపహరించి గంటల తరబడి హింసించారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. కాళ్లలో మేకులు దించారు. దీంతో అతడు చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

కాగా ఈ కేసు విషయాన్ని సమీపంలోని మరో ఆర్టీఐ కార్యకర్త రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్చ్ఆర్సీ ఈ విషయమై రాష్ట్ర డీజీపీని వివరాలు కోరింది. ఈ కేసులో దుండగులను విషయమై కూడా ప్రశ్నించింది. దీంతో ఘటన జరిగిన మరుసటి రోజు బార్మర్ జిల్లాలోని పరేయు గ్రామానికి వచ్చిన జిల్లా ఎస్పీ.. పరిశీలించారు. మద్యం మాఫియా పెద్దల అండదండతోనే ఆర్టీఐ కార్యకర్తపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. కాగా పోలీసులు ఈ కేసులోని నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. కాగా గోద్రా కోలుకున్న తరువాత ఈ కేసులో మరికోందరి పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles