Refusal to marry after sexual relation not cheating: HC శారీరిక సంబంధం ఉండి.. పెళ్లికి నిరాకరించడం.. మోసం కాదు: హైకోర్టు

Refusal to marry after years of sexual relationship isn t cheating bombay hc

sexual relationship cheating, cheating case, bombay high court, sexual relation, relationship before marriage, physical relation before marriage, Cheating case, conviction, Bombay HC, Maharashtra, Crime

The Bombay High Court has ruled that refusal to marry a woman after having physical relations for a long time with mutual consent, does not amount to cheating. The High Court’s judgment came after it overturned a lower court order convicting the man of cheating based on a woman’s FIR alleging that the accused had a sexual relationship with her on the pretext of marriage but subsequently declined to marry her.

ఏళ్లుగా శారీరిక సంబంధం.. పెళ్లికి నిరాకరించడం.. మోసం కాదు: హైకోర్టు

Posted: 12/24/2021 12:14 PM IST
Refusal to marry after years of sexual relationship isn t cheating bombay hc

మహిళతో పరిచయం ఏర్పర్చుకుని పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కొనసాగించడం.. ఆ తరువాత అమెతో పెళ్లికి నిరాకరించిన కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించ్చింది. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కొనసాగించడం.. ఆపై అమెతో పెళ్లికి నిరాకరించడం మోసం చేసినట్టు కాదని ఓ కేసులో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ఈ తరహా కేసులో కింది కోర్టు తీర్పు మేరకు ఏడాది పాటు కారాగారవాసం అనుభవించిన వ్యక్తిని దాదాపుగా పాతికేళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతో చేసిన శృంగారం ఎలా మోసం చేసినట్లు అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది.

తనను పెళ్లి చేసుకుంటానన్న హామీతోనే నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నిజానికి పెళ్లికి నిరాకరించడం సెక్షన్ 417 కింద నేరం కాదని పేర్కొంది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్గఢ్‌కు చెందిన వ్యక్తి తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆపై పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడంటూ 1996లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అనంతరం మూడేళ్ల తర్వాత పాల్గఢ్ అదనపు న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చి ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు.

దోషిగా తేలిన నిందితుడు పాల్గడ్ అదనపు న్యాయమూర్తి వేసిన ఏడాది కారాగారవాస శిక్షను అనుభవించిన తరువాత.. ఈ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. పాతికేళ్ల నాటి ఈ కేసును తాజాగా మహారాష్ట్ర రాష్ట్రోన్నత న్యాయస్థానం నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఏళ్లుగా శారిరిక సంబంధం పెట్టుకుని తరువాత నిందితుడి సమక్షంలో మోసం చేశాడని అనకుండా.. అతని వెనుక ఈ కుట్రను పన్నారని తెలుస్తోందని పేర్కోంది. పెళ్లి మాటను మహిళ ప్రస్తావించడం వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే, ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం అతడికి ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఫలితంగా 25 సంవత్సరాల తర్వాత నిందితుడు నిర్దోషిగా బయటపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles