Omicron variant: Night sweats are a telltale sign ఈ లక్షణం కనిపించినా అది ఒమిక్రాన్ వేరియంట్ కరోనానే

Omicron infects 70 times faster but is less severe study says

COVID-19, Omicron, covaxin, phfi, covid variant, covid, icmr, Omicron, covid, delta variant, omicron symptoms, what are the symptoms of omicron, what are the symptoms of omicron virus, COVID booster dose Britain, booster dose above 30 years, booster dose at-risk people, Omicron symptoms, Omicron corona variant, Omicron B.1.1.529, covid new variant, covishield, covaxin, astrazeneca, covid-19 vaccination, nationwide vaccination drive, vaccination drive, covid news, corona updates

At a briefing convened by South Africa’s Department of Health, general practitioner doctor Unben Pillay listed the symptoms that omicron patients were reporting. One telltale sign may surface during the night, according to the doctor. Patients are presenting with "night sweats", he said. Night sweats are when you sweat so much that your night clothes and bedding are soaking wet, even though where you're sleeping is cool.

ఈ లక్షణం కనిపించినా అది ఒమిక్రాన్ వేరియంట్ కరోనానే

Posted: 12/16/2021 03:07 PM IST
Omicron infects 70 times faster but is less severe study says

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తి చెందినా.. దాని కారణంగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స చేయించుకునే వారి సంఖ్య తక్కువని వైద్య అద్యయనాలు స్పష్టం చేయడంతో ప్రపంచ దేశాలు కొంత ఊరట పోందుతున్నాయి. కాగా, ఈ ఊరట తాత్కాలికమేనా లేక శాశ్వతమా.? అన్న వివరాలు ఒమిక్రాన్ పై జరిగే పూర్తి అధ్యయనం తరువాత కానీ వెలుగులోకి రాదు. ఈ వేరియంట్ లక్షణాలు కూడా తీవ్రంగా లేకపోవడంతో అందరూ తేలిగ్గా తీసుకుంటున్నా.. ఇది పునర్ వ్యాప్తి కూడా చెందుతుండటం అందోళనకర విషయమేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలుత గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ ఈ వేరియంట్ తాలుకు లక్షణాలను వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో డెల్టాకు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. దాని బారినపడిన వారు రాత్రుళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. కొవిడ్ లక్షణాలైన దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం వంటివి ఒమిక్రాన్ బాధితుల్లో లేవన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు వివరించారు. కొందరిలో మాత్రం రాత్రిపూట విపరీతంగా చెమటపట్టడం వంటి భిన్నమైన లక్షణం కనిపిస్తున్నట్టు చెప్పారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు ఎంత చల్లని ప్రాంతంలో వున్నా.. నిద్రించినా వారి బట్టలు మాత్రం చమటతో తడిసిపోతున్నాయని అన్నారు.

ఇక తాజా అధ్యయనాలు ఈ స్ట్రెయిన్ పై సానుకూల అంశాలను వెల్లడించాయి. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య చాలా తక్కువని వెల్లడైంది. ఇక ఈ వేరియంట్ బారిన‌ప‌డిన వారికి 29 శాతం ముప్పు తక్కువని చెప్పారు. ఒమిక్రాన్ బారిన పడినవారు ఆస్ప‌త్రిలో చేరే అవ‌కాశం మూడో వంతు త‌క్కువ‌గా ఉంద‌ని ద‌క్షిణాఫ్రికాలో చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న స్ప‌ష్టం చేసింది. 78,000 ఒమిక్రాన్ కేసుల‌ను ప‌రిశీలించిన మీద‌ట అధ్య‌య‌నం ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. ఆ వివరాలు ఇలా వున్నాయి

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఆస్ప‌త్రిలో చేరే ముప్పు అయిదో వంతు త‌క్కువ‌గా ఉండ‌గా, ఒరిజిన‌ల్ వైర‌స్ కంటే 29 శాతం ముప్పు త‌క్కువ‌గా ఉంద‌ని తాజా అధ్యయనంలో తేలింది. డెల్టా కేసుల్లో ప్ర‌తి వేయిలో 101 మంది ఆస్ప‌త్రిలో చేరాల్సి రాగా 1000 ఒమిక్రాన్ కేసుల్లో 38 అడ్మిష‌న్స్ ఉన్నాయ‌ని అధ్య‌య‌నం పేర్కొంది. గ‌త స్ట్రెయిన్ల‌తో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ బ‌ల‌హీన‌మైంద‌ని ప‌రిశోధ‌న‌లో గుర్తించారు. మ‌రోవైపు ద‌క్షిణాఫ్రికాతో పోలిస్తే బ్రిట‌న్‌లో పెద్ద‌సంఖ్య‌లో బూస్ట‌ర్ డోసులు పంపిణీ చేయ‌డంతో ఒమిక్రాన్ తీవ్ర‌త పెద్ద‌గా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Omicron  Variant  Covid  WHO  covaxin  phfi  covishield  coronavaccine booster dose  above 30 years  omicron symptoms  

Other Articles