Groom Flees Wedding Scene with dowry and gold ornaments గంటలో పెళ్లి.. వధువు కట్నం డబ్బు, నగలతో పారిపోయిన వరుడు..

Groom flees wedding scene before an hour with dowry amount and gold ornaments

bridegroom flees wedding spot before marriage, groom vanishes with cash and gold, groom flees with dowry amount, groom disappears wedding spot, groom flees with bride dowry, groom escape, groom fled, manik reddy, dowry amount, gold ornaments, Malkapur, chimnapur, kandhi mandal, Sangareddy, Telangana, Crime

A groom recently disappeared from his wedding at the last moment before an hour to his marriage with the bride’s family given dowry amount of Rs 25 Lakhs and 25 tula gold ornaments in Sangareddy district of Telangana. The shocking incident took place on Sunday, 12 December 2021, in Malkapur village under Sangareddy police limits of the Sangareddy district. The groom's Family also vanishes their native village, bride approched Police and complained on the Issue.

గంటలో పెళ్లి.. వధువు కట్నం డబ్బు, నగలతో పారిపోయిన వరుడు..

Posted: 12/16/2021 03:59 PM IST
Groom flees wedding scene before an hour with dowry amount and gold ornaments

మరోగంటలో పెళ్లి.. అందరూ వరుడి కోసం వేచిచూస్తున్నారు.. పెళ్లి కొడుకును తీసుకురావడానికి వారింటికి వెళ్లిన బంధువులకు షాక్ తగిలింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వారు ఇరుగు పోరుగువారిని ఆరా తీశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారింటి ముందు నాటిన పందిరి గుంజ అలానే ఉంది. ఇంటికి వేసిన రంగులు తడి కూడా ఆరలేదు. ఇంటికి కట్టిన మామిడి తోరణాలు.. వేసిన పందిరి అంతా అలానే వుంది. కానీ ఇంతలో ఏం జరిగింది. ఈ లోగా పెళ్లి వేదిక నుంచి పెద్దల ఫోన్ కాల్స్. ఇక లాభం లేదని విషయాన్ని వారికి తెలియజేశారు. అదెలా సాధ్యం అనుకుంటూ పెళ్లి వేదిక వద్ద బంధువులు కూడా హైరానా చెందారు.

వరుడి గ్రామం నుంచి వివాహవేదికకు కనీసం పది నిమిషాల సమయం కూడా పట్టదు. కానీ అరగంటకు పైగానే ఎదురుచూసినా వరుడి జాడ లేదు. సంగారెడ్డి జిల్లాలోనే ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. అలాంటిది అంతపెద్ద అన్యాయం మా బిడ్డకే ఎందుకు జరిగింది.. అంటూ వధువు తల్లితండ్రులకు తోడు అమె బంధువులు కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పెళ్లి రోజున.. కళ్యాణానికి ఓ గంట ముందు.. వరుడు తన ఇంట్లోంచి కట్నం డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. ఈ విషయం తెలియడంతో వరుడి తల్లిదండ్రులు కూడా తమను వధువు కుటుంబం వదలదన్న భయంతో పలాయనం చిత్తగించారు.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతిని.. కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించాలని ఇరు తరపు పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టులో ఈ నూతన జంటకు నిశ్చితార్థం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుడికి రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు.

ఈ నెల 12న వీరి వివాహం జరగాల్సి ఉండగా, సంగారెడ్డిలోని పోతిరెడ్డి‌పల్లిలో కల్యాణ మండపం ఏర్పాటు చేశారు. సరిగ్గా మరో గంటలో వివాహం జరుగుతుందనగా కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారం పట్టుకుని వరుడు ఊరి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాధిత వధువు నిన్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ వరుడు, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles