legal marriage age for women raised from 18 to 21 years అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు

Minimum age for marriage of women from 18 to 21 cabinet clears proposal

women legal marriage age India, women marriage age, legal marriage age, minimum age for marriage, PM Modi on women empowerment, jaya jaitly PM Modi Independence Day speech, child marriage, legal age for marriage, marriage age in India, Jaya Jaitley, task force panel, NITi Aayog, Hindu Marriage Act, Child Marriage Act, current affairs, current affairs news

The Union Cabinet is learnt to have passed a proposal to raise the legal age of marriage for women from 18 to 21 years – the same as men. The Cabinet nod to the Bill, the government will introduce an amendment to the Prohibition of Child Marriage Act, 2006, and consequently bring amendments to the Special Marriage Act and personal laws such as the Hindu Marriage Act, 1955.

అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

Posted: 12/16/2021 01:42 PM IST
Minimum age for marriage of women from 18 to 21 cabinet clears proposal

భారతదేశంలో సాధారణంగా అమ్మాయిల పెళ్లి వయస్సు పద్దెనిమిదేళ్లు. కానీ ఇకపై 21 ఏళ్లు. ఔనండీ ఇది ముమ్మాటికీ నిజం. దీంతో 2020లో పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఒక ఏడాది సమయం తరువాత వాస్తవ రూపం దాల్చబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూడా ఈ కీలక నిర్ణయం పట్ల అమోదం తెలిపింది. అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అబ్బాయిల వివాహ వయస్సు మాదిరిగానే ఇకపై అమ్మాయిలకు కూడా 21 ఏళ్లు దాటిన తరువాతే వివాహాలు జరపాలని నిర్ణయం తీసుకుంది.

అబ్బాయిలు ఇన్నాళ్లు అమ్మాయిల కన్నా కనీస వివాహ వయస్సులో కొంచెం ఎక్కువగా ఉన్నారు. కాగా తాజాగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సరిసమానమే. కొంచెం ఎక్కువ కాదు.. కొంచెం తక్కువ కాదు. ఈ మేరకు అమ్మాయిల కనీస వివాహ వయస్సును పెంచాలని తమ ప్రణాళిక సమీక్షలో వుందని ప్రధాని గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కారించుకుని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని కూడా చెప్పిన విషయం తెలిసిందే. నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ప్యానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయాన్ని కేంద్ర క్యాబినెట్ తీసుకుంది.

గతేడాది జూన్ లో జయ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ టాస్క్‌ ఫోర్స్‌ ఈ మేరకు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ ఉన్నత నిపుణుడు వీకే పాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. మొదటి గర్భధారణ సమయంలో స్త్రీకి కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ నొక్కిచెప్పింది. కేంద్ర క్యాబినెట్ ఈ సవరణకు అమోదం కూడా తెలిపిన నేపథ్యంలో ఇక పార్లమెంటులోని ఉభయ సభల్లో దీనికి అమోదం ప్రకటించుకోనుంది. దీంతో ఈ నూతన సవరణను బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకురానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles