Bangladesh sentences 20 to death for student murder క్యాంపస్ హత్యకేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష

Bangladesh sentences 20 students to death in buet abrar fahad murder case

bangladesh,sheikh hasina, bangladesh students get death sentence, Facebook, Student murdered for criticising government in bangladesh, Abrar Fahad, Bangladesh Chhatra League, Awami League bangladesh, sheikh hasina, bangladesh university students, death sentence, Facebook, Abrar Fahad, Bangladesh Chhatra League, Awami League, bangladesh, Crime

A court in Bangladesh has sentenced 20 university students to death and five more to life imprisonment for the killing of a fellow student who criticised the government on social media. Abrar Fahad, a 21-year-old second year student of the country’s prestigious Bangladesh University of Engineering and Technology (BUET) was beaten to death on October 7, 2019 by 25 BUET students who were members of Chhatra League, the student wing of the ruling Awami League party.

క్యాంపస్ హత్యకేసులో కోర్టు సంచలన తీర్పు: 20 మంది విద్యార్థులకు మరణశిక్ష..

Posted: 12/10/2021 01:41 PM IST
Bangladesh sentences 20 students to death in buet abrar fahad murder case

ఇంజనీరింగ్ విద్యార్థి హత్య కేసులో బంగ్లాదేశ్ ట్రయల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. క్యాంపస్ హత్యకేసు ఘటనలో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. దేశాభ్యున్నతికి దోహదపడాల్సిన విద్యార్థులు తమలో తాము విడిపోయి ప్రత్యర్థులుగా మారి హింసను ప్రేరేపించడంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం విద్యార్థి హత్యకేసులోని 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (బీయూఈటీ)లో సెకండియర్ చదువుతున్న 21 ఏళ్ల అబ్రార్ ఫహాద్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019లో ఓ పోస్టుపెట్టాడు. సామాజిక మాద్యమమైన ఫేస్‌బుక్ లోని తన అకౌంట్ ద్వారా అబ్రార్ ఈ పోస్టుపెట్టాడు. దీంతో అబ్రార్ గురించి ఆరా తీసిన అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థివిభాగం బంగ్లాదేశ్ చాత్ర లీగ్ (బీసీఎల్) కార్యకర్తలు, అతడిని జమాతే ఇస్లామీకి చెందిన స్టూడెంట్ ఫ్రంట్ కార్యకర్తగా అనుమానించారు. దీంతో అబ్రార్ ను వెతికిమరీ అత్యంత దారుణంగా హతమార్చారు బీసీఎల్ విద్యార్థి సంఘం కార్యకర్తలు.

అబ్రార్ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగాయి. మరోవైపు, హత్య తర్వాత నిందితులైన 20 మంది కార్యకర్తల సభ్యత్వాలను బీసీఎల్ రద్దు చేసింది. తాజాగా ఈ కేసులో తుది తీర్పు వెల్లడించిన ట్రయల్ కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. 20 మందికి మరణశిక్ష, మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles