Lord Yadagiri LaxmiNarasimha swamy's Seva to cost more యాదగిరి దేవస్థానంలో పూజా, ప్రసాదాల ధరలు పెంపు

Lord yadagiri laxmi narasimha swamys laddu and pulihora to cost more

Yadadri temple, Ramalingeshwara Swamy temple, Sri Purva Giri Laxmi Narasimha Swamy temple, puja tickets, prasadam ticket, permanent puja tickets, Nivedana Prasadam, Nijabhishekam, Sahasra Namarchana, Sudarsana Narasimha Homam, Nitya Kalyanotsava, Shataghatabhishekam, Laksha Pushparchana, Vendi Jodu Mokkula Sevas, Suvarna Pushparchana, Veda Ashirvachanam, Andal Ammavari Unjal Seva, Laddu Prasadam, pulihora, Vada, Yadadri Puja Ticket rates, Yadadri Prasadam Ticket rates, Yadadri, Devotional, Telangana

Yadadri temple EO Geetha Reddy has stated that the prices of tickets for worship, permanent pujas, Nivedana Prasadam ( Bogum) etc., at the temple have been increased and will come to force from today i.e, December 10.

యాదగిరి లక్ష్మీనరసింహా దేవస్థానంలో పూజా, ప్రసాదాల ధరలు పెంపు

Posted: 12/10/2021 12:42 PM IST
Lord yadagiri laxmi narasimha swamys laddu and pulihora to cost more

యాదాద్రి ఆలయంలో పూజలు, శాశ్వత పూజలు, బోగం ప్రసాదాల టిక్కెట్ల ధరలు పెంచామని, ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. యాదాద్రి ఆలయంతో పాటు కొండపై కొలువైన శ్రీ పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు యాదాద్రి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పూర్వ గిరి లక్ష్మీనరసింహ స్వామి (పాతగుట్ట) దేవాలయంలో టిక్కెట్ల ధరలను పెంచారు. నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతున్న నేపథ్యంలో ప్రసాదాలు, పూజల ధరలు కూడా పెంచడం అనివార్యంగా మారిందని అన్నారు.

యాదాద్రిలో కొన్నేళ్ల క్రితం టిక్కెట్టు ధరలు పెంచామని, కాగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో తెలిపారు. ఇక దేవస్థానం కొనుగోలు చేసే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలను సవరించాల్సి వచ్చిందని ఈఓ వివరించారు. యాదాద్రి ప్రధాన ఆలయంలో నిజాభిషేకం (ఇద్దరికి) రూ.500 నుంచి రూ.800లకు, ఒక్కొక్కరికి రూ.250 నుంచి రూ.400లకు పెంచారు. సహస్ర నామార్చన టికెట్ ధర రూ.216 నుంచి రూ.300కి, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,250 (రూ.1,116), నిత్య కల్యాణోత్సవానికి రూ.1,500, సందర్శన నరసింహ హోమానికి రూ.1,116గా ఉంది. అలాగే శతఘటాభిషేకం, లక్ష పుష్పార్చన, వెండి జోడు మొక్కుల సేవలు, సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ టిక్కెట్ల ధరలు పెరిగాయి.

యాదాద్రిలో పెరిగని ధరలు ఇలా:-

నిజాభిషేకం (ఇద్దరికి) రూ.500 నుంచి రూ.800
నిజాభిషేకం (ఒక్కరికి) రూ.250 నుంచి రూ.400
సహస్ర నామార్చన టికెట్ ధర రూ.216 నుంచి రూ.300
సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 నుంచి రూ.1,250  
నిత్య కల్యాణోత్సవానికి రూ.1,116 నుంచి రూ.1,500
శతఘటాభిషేకం, లక్ష పుష్పార్చన, వెండి జోడు మొక్కుల సేవలు, సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ టిక్కెట్ల ధరలు పెరిగాయి.

పెరిగిన ప్రసాదం ధరలు
100 గ్రాముల లడ్డూ రూ.20 నుంచి రూ.30
500 గ్రాముల లడ్డూ రూ.100 నుంచి రూ.150
250 గ్రాముల పులిహోర రూ.20
250 గ్రాముల వడ రూ.20కి పెరిగింది.

రామలింగేశ్వర స్వామి దేవాలయంలో..
రుద్రాభిషేకానికి రూ.116 నుంచి రూ.200
అష్టోత్తరానికి రూ.100 నుంచి రూ.200
కల్యాణోత్సవానికి రూ.250 నుంచి రూ.500
ఊరేగింపు సేవకు రూ.116 నుంచి రూ.250
మాస శివరాత్రి రుద్రాభిషేకం, సోమవారం రుద్రాభిషేకం, నవగ్రహ పూజ, శని త్రయోదశి (తైలాభిషేకం) పూజ, కోడె మొక్కు పూజ తదితర టిక్కెట్ల ధరలు పెరిగాయి. ఒక యాదాద్రికు అనుంబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట దేవాలయంలోనూ టిక్కెట్ ధరలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. వివిధ సేవాలకు ధరల పెంపుతో పాటు పాతగుట్ట ఆలయంలో శాశ్వత పూజలు కూడా పెరిగాయి. ప్రతి శుక్రవారం శాశ్వత నిత్య నిజాభిషేకం, శాశ్వత కల్యాణం (ఏడాదిలో ఒకరోజు), శాశ్వత నిత్య సహస్ర నామార్చన, ఆండాళ్ అమ్మవారి నిత్యాభిషేకం టిక్కెట్లను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles