One teaspoon of donkey's milk sold for Rs. 100 భగ్గున మండుతున్న గాడిద పాల ధరలు. ఎంతో తెలిస్తే షాక్..

Drink one teaspoon of milk and get rid of all kinds of diseases donkey s milk sold for rs 10 000 a litre

donkey milk, immunity booster, donkey's milk increases immunity, fight against infections, fight against corona, Hingoli district, maharashtra, viral news

Donkey milk is being sold in Hingoli district of Maharashtra. Milk sellers are claiming that drinking donkey's milk increases immunity in the body and is very powerful. It proves to be very effective in the fight against infections like corona.There is a huge crowd in Hingoli to get donkey's milk. Donkey's milk is being sold for ten thousand rupees per liter.

భగ్గున మండుతున్న గాడిద పాల ధరలు.. ఎంతో తెలిస్తే షాక్..

Posted: 12/10/2021 03:49 PM IST
Drink one teaspoon of milk and get rid of all kinds of diseases donkey s milk sold for rs 10 000 a litre

‘‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు.. భక్తి కలుగు కూడు పట్టెడైననుచాలు.. విశ్వదాభిరామ వినురవేమ.. అన్న పద్యము వినని తెలుగువాడు లేడు. ఆవు పాలలో వున్న విశిష్టత.. వాటిని శిశువులకు పట్టిస్తే కలిగే లాభాల గురించి కవి వేమన పద్యంలో చెప్పారు. శ్రేష్టమైన ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు. గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావంటూ.. ఉపమానంగా రకరకాల ఆహార పదార్ధాలతో వండిన విందు భోజనం కంటే దేవుని పై భక్తిని నిలిపే సాత్వికమైన కొంచెం ఆహారం ఎంతో మేలు అని చెప్పారు.

కానీ మారుతున్న కాలంతో ఈ పద్యం కూడా తిరగబడిందా.? అన్న అనుమానాలు కలగకమానవు. ఎందుకంటే.. ఆవు పాలు కడివెడైనా చటుక్కున లభించే ఈ రోజుల్లో ఖరము (గాడిద) పాటు మాత్రం దొరకడంలేదు. ఒకవేళ దొరికినా.. లీటరు గాడిద పాలధర ఏకంగా పదివేల రూపాయలకు పైమాటే. పిల్లాడు ఏడుస్తున్నాడు అంటే పక్కునున్న చంటిబిడ్డల తల్లులు ఆవు పాలు, లేదా పాలు ఇవ్వడానికి వెనుకాడారు. కానీ అదే కనీసం టీస్పూన్ గాడిద పాలు కావాలన్నా.. జేబులోంచి పచ్చనోటు తరలివెళ్లాల్సిందే అనేలా సీన్ ఉంటే ఎవరు మాత్రం ఇస్తారు. ఆవు పాల కన్నా ఖరము పాలే ఖరీదైనవిగా మారిపోయాయ్.

దీంతో గాడిదపాల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గాడిద పాలు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందట. వైరస్, ఫ్లూ సహా కరోనా మహమ్మారి లాంటి ఇన్ఫెక్షన్పై గాడిద పాలు ధీటుగా పోరాడి.. వాటిని ఎదుర్కోనేలా శక్తినిస్తాయట. ఈ మేరకు గాడిద పాల విక్రేతలు పేర్కోంటూన్నారు. గాడిద పాటు ఆరోగ్యపరంగా చాలా శ్రేష్టమైనవి.. ఇందులో రోగనిరోధక శక్తి అధికంగా వుందన్న నమ్మకంతో పాటు.. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందనే నమ్మకం కూడా లేకపోలేదు.

అరోగ్యం పేరు చెప్పి.. అందునా రోగనిరోధకశక్తిపేరుతో గాడిద పాలను లీటరుకు పది వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక వీటిని తీసుకెళ్లేవాళ్లు కూడా ఆ మొత్తాన్ని వెచ్చించి మరీ తీసుకెళ్లడం గమనార్హం. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గాడిద పాల వ్యాపారం బారీ స్థాయలో జరుగుతోంది. హింగోలిలో వీధి వీధికి గాడిద పాలను విక్రయిస్తున్నారు. రోజూ స్పూను పాలు తాగితే అన్ని రకాల రోగాలు దూరమవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాడిదపాలల్లో ఔషధగుణాలు అధికంగానే ఉంటాయని చెబుతున్న విక్రేతలు వీటిని చిన్నారులకు మూడేళ్లు వచ్చే వరకు పట్టిస్తూ మంచి ఫలితాలు వుంటాయని చెబుతున్నారు.

శిశువులు, చిన్నారుల్లో న్యుమోనియాను దూరం చేస్తుందని, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని పాల విక్రయదారులు నమ్మబలికి వ్యాపారం చేస్తున్నారు. అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ధరను ఏకంగా పదివేల రూపాయలకు అమ్ముతున్నారు. గాడిద పాలతో పలు వ్యాధులను ఎదుర్కోనే శక్తి ఉందని.. నమ్ముతన్న కొందరు ఆ పాలను కొనేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. ఇక చిన్నారులకు రోజు టీస్పూస్ పాటు తాగిస్తే వారు తరచూ అనారోగ్యం బారిన కూడా పడరన్న ప్రచారం కూడా జోరుగా కోనసాగుతోంది.  

అయితే గాడిద పాలతో ఇమ్యూనిటీ వస్తుందన్న మాటల్లో వాస్తవం కాదని.. ఇది పూర్తిగా సత్యదూరమని అంటున్నారు కోందరు వైద్యులు. కరోనా వైరస్ లాంటి మహమ్మారులను ఎదుర్కోనగల శక్తి గాడిద పాలలో లేదని, తప్పనిసరిగా కరోనా బారిన పడిన వారు వైద్యులు అందించే మందులను వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్‌ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసకోవద్దని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles