ఉత్తరప్రదేశ్ లో మైనర్ విద్యార్థినులపై దారుణం జరిగింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పేరుతో పాఠశాల నిర్వాహకుడు అతని అసిస్టెంట్ మైనర్ బాలికపై లైంగిక దాడులకు తెగబడ్డారు. పరీక్షలు వున్నాయన్న నెపంతో వారిని తమ పాఠశాలకు రప్పించి.. వారు తినే ఆహారంలో మత్తుమందు కలపి.. వారు సృహకోల్పోయిన తరువాత వారిపై అఘాయిత్యాలకు తెగబడ్డారు. ముజఫర్ నగర్ జిల్లా పుర్కాజి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కాగా న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ జిల్లా పరిధిలోని పుర్కాజీ ప్రాంతంలో గల పాఠశాలకు స్థానిక పేద కుటుంబాలకు చెందిన పాఠశాల హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చారు. ఈ పాఠశాలలో 29 మంది విద్యార్థినులు పదో తరగతి చదువుతుండగా, వారిలో కేవలం 17 మందిని మాత్రమే ప్రాక్టికల్ పరీక్షల పేరుతో పూర్కాజీ ప్రాంతంలోని పాఠశాలకు తరలించారు. అయితే రెండు పరీక్షలు ముగిసిన తరువాత మళ్లీ మరుసటి రోజు పరీక్షలు ఉంటాయని చెప్పిన యాజమాన్యం.. వారిని అక్కడే పాఠశాలలో పడుకోవాలని అదేశించింది.
అయితే విద్యార్థినులకు ఆ రోజు రాత్రి ఆహారంగా కిచిడీ పెట్టారు. అది కాస్తా.. ఉడుకీ ఉడకనట్టుగా వుంది. దీంతో పాఠశాల నిర్వాహకుడు యోగేశ్ చౌహాన్ స్వయంగా వండి విద్యార్థులకు వడ్డించారు. అయితే అందులో మత్తమందు కలపడంతో దానిని తిన్న తరువాత విద్యార్థినులు అందరూ సృహ కోల్పోయారు. అలా నిర్జీవంగా పడుకున్న విద్యార్థినులపై నిర్వాహకుడు అతని అసిస్టెంటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, చెబితే ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత భయపడిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లలేదు.
దీంతో వారి తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిసి విస్తుపోయారు. అలా 17 రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడైన పాఠశాల నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సహాయకుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చర్యలు చేపట్టింది. కేసు వివరాలను తమకు నివేదించాలని ముజఫర్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more