CDS General Bipin Rawat's chopper crashes తమిళనాడులో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..

Iaf helicopter crash chopper with cds gen bipin rawat crashes 4 dead three injured

military chopper crash live updates,helicopter crash live updates,bipin rawat chopper crash live,bipin rawat helicopter crash near coonoor,tamil nadu helicopter crash, CDS Gen Bipin Rawat, IAF chopper crash, indian air force, rajnath singh, parliament, Coonoor, Tamil Nadu, Crime

An Indian Air Force helicopter with Chief of Defence Staff General Bipin Rawat on board crashed in Tamil Nadu's Coonoor. Four people have been confirmed dead in the incident. Three people have been rescued so far while a search is on for the others. There were fourteen people on board, according to sources.

తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణం..

Posted: 12/08/2021 03:01 PM IST
Iaf helicopter crash chopper with cds gen bipin rawat crashes 4 dead three injured

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. హెలీకాప్టర్‌లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. ప్రమాద తీవ్రతకు మంటలు ఎగిసిపడ్డాయి.

వెల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే ఓ హోటల్‌ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్‌లో సీడీఎస్‌ బిపిన్‌రావత్‌తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్‌ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా 11 మంది దుర్మరణం పాలైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. హెలీకాప్టర్‌ సామర్థ్యం 24 మంది.

బిపిన్‌ రావత్‌ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌. ఇది 4వేల పేలోడ్‌ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నట్లు తెలిసింది. 4వేల పేలోడ్‌ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్‌ ఇంజన్‌ హెలికాప్టర్‌.హెలికాప్టర్‌లో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు బ్రిగేడియర్‌ లిద్దర్‌, కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, పీఎస్‌ఓలు గురుసేవక్‌ సింగ్‌, జితేంద్రకుమార్‌, వివేక్‌ కుమార్‌, సాయితేజ్‌, సత్‌పాల్‌ ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంపై వాయుసేన తక్షణ విచారణకు ఆదేశించింది. ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్‌లు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles