Five arrested for stripping 4 women naked and beating them దొంగతనం చేశారని.. నలుగురు మహిళల బట్టలూడదీసిన జనం

Viral video 5 arrested for stripping 4 women naked and beating them in pakistan

women stripped, women assaulted, assault on women, women stripped in faisalabad, women stripped in punjab province, women stipped in pakistan, Millat Town Police Station, ragpicker, garbage pickers, Bawa Chak Market, Usman Electric Store, water bottle, Saddam, Stealing, Faisalabad, Punjab Province, Pakistan, Crime

A disturbing video of some women being stripped naked and beaten by a group of men in Pakistan’s Faisalabad had gone viral on social media. Acting on the incident, Faisalabad Police has arrested five men for assaulting, stripping and filming four women in Pakistan’s Punjab province. The incident took place in Bawa Chak Market, Faisalabad, Pakistan.

ITEMVIDEOS: నలుగురు మహిళలపై దొంగతనం అరోపణలు.. బట్టలూడదీసి చిత్రహింసలు..

Posted: 12/08/2021 12:43 PM IST
Viral video 5 arrested for stripping 4 women naked and beating them in pakistan

పురుషాధిక్య సమాజంలోనూ మహిళలపై కాసింత మానవత్వం కనిపిస్తోంది. తమ ఇంట్లోని మహిళలకే ఆంక్షలు విధించి.. బయటకు వస్తే ముసుగులు ధరించాల్సిన కట్టుబాట్లు రాజ్యమేలే పలు దేశాల్లో మహిళపై గృహహింస ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనలవికాదు. అయితే ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకుని.. షారియా చట్టాలు అమలు చేస్తున్న దేశాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అయితే పాకిస్థాన్ వంటి దేశాల్లో మాత్రం మ‌రోసారి క్రూర‌త్వం బ‌య‌ట‌ప‌డింది. న‌లుగురు మ‌హిళ‌ల్ని కొంద‌రు దారుణంగా చిత‌క‌బాదారు. బ‌ట్ట‌లు ఊడ‌దీసి మ‌రీ పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. న‌లుగురు మ‌హిళ‌ల్లో ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంది.

పంజాబ్ ప్రావిన్సులోని ఫైస‌లాబాద్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్ పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఫైస‌లాబాద్‌లోని బాబా చౌక్ మార్కెట్‌లో ఓ షాపులోకి ఎంట‌ర్ అయిన న‌లుగుర్ని మ‌హిళ‌ల్ని ఆ షాపు ఓన‌ర్ చిత‌క‌బాదారు. వ‌స్తువులు దొంగ‌లించేందుకు వ‌చ్చిన‌ట్లు అనుమానించిన ఆ షాపు యాజ‌మాని మ‌రికొంత మందితో క‌లిసి ఆ మ‌హిళ‌ల‌పై దాడి చేశారు. క‌ర్ర‌ల‌తో కొట్టారు. బ‌ట్ట‌లు ఊడ‌దీసి మ‌రీ చిత‌క‌బాదారు. సుమారు గంట పాటు మార్కెట్ వీధిలో న‌గ్నంగా ఊరేగించారు. శ‌రీరంపై క‌ప్పుకోవ‌డానికి బ‌ట్ట‌లు ఇవ్వండి అంటూ ఆ మ‌హిళ‌లు వేడుకున్నా.. ఏమాత్రం క‌నిక‌రం చూడ‌కుండా కొట్టారు.


కాగా, మహిళలను తాము బట్టలిప్పి కోట్టామన్న అరోపణలను షాపు యజమాని సహా పక్కున్న దుకాణాదారులు కూడా ఖండిస్తున్నారు. ఈ నలుగురు మహిళలు తమ ఉస్మాన్ ఎలక్ట్రికల్ షాపులోనికి దౌర్జన్యంగా ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించారని చెప్పారు. షాపులోనికి వచ్చిన ఓ మహిళ చెత్త తీసుకునేందుకని లోనికి ప్రవేశించింది. అమె వెనకాలే మరో ముగ్గురు మహిళలు వచ్చారు. ఇంతలో మొదట వచ్చిన మహిళను అడ్డుకుంటున్నా అమె లోనికి వెళ్లింది. ఇక షాపులోకి చోరబడిన ముగ్గురు కూడా విలువైన వస్తువులను అపహరించారని దుకాణాదారులు అరోపిస్తున్నారు.

వారు తీసుకున్న వస్తువులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతోనే వారు తమ దుస్తులను విప్పుకుని.. తమపై అరోపణలు చేస్తున్నారని దుకాణాదారులు అరోపిస్తున్నారు. ఈ మేరకు షాపులోని సిసిటీవీలో రికార్డైన దృష్యాలను కూడా చూపిస్తున్నారు. అయితే మహిళలపై తాము దౌర్జన్యానికి తెగబడ్డామని చెప్పడం సత్యదూరమని అన్నారు. తమను కోట్టి బట్టలను ఊడదీసి.. చితకబాదామన్న అసత్య అరోపణలతో తప్పించుకోవాలని చూస్తున్నారని వారు అరోపించారు. ఇందుకు సంబంధించిన షాపులోని సిసిటీవీ దృష్యాలను కూడా వారు విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles