SC nod for elevation of Saurabh Kirpal as Delhi HC judge తన జన్మదినం రోజున ప్రవచిస్తూనే పరమపదించిన స్వామీజీ

Sanganabasava swami dies suffering heart attack while addressing audience on his birthday

Sanganabasava Swami, chief saint of Balobala Math, head of Basavayog Mandap Trust, shocking incident, heart attack, chief saint, Balobala Math, Basavayog Mandap Trust, heart attack, birthday, followers, 53rd birthday, addressing followers, Belgaum, Karnataka, crime

A shocking incident has taken place at Belgaum in Karnataka. A sage suffered a heart attack while giving a speech at the event and died on the stage. The incident took place on November 6. Sanganabasava Swami was addressing his followers, when he suddenly fainted. He was rushed to a hospital, where doctors pronounced him dead.

ITEMVIDEOS: తన జన్మదినం రోజున ప్రవచిస్తూనే పరమపదించిన స్వామీజీ

Posted: 11/17/2021 11:34 AM IST
Sanganabasava swami dies suffering heart attack while addressing audience on his birthday

కర్ణాటకలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి వారిని నిత్యం సన్మార్గంలో నడవాలని ప్రవచిస్తూనే పీఠాధిపతి పరమపదించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మాట్లాడుతున్న స్వామిజీకి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తాను కూర్చుకున్న కుర్చీలోనే వెనక్కు ఒరిగి ప్రాణాలను విడిచారు. ఆయన ఒక్కసారిగా వెనక్కు ఒరిగిపోవడంతో ఏమైందోనన్న అందోళనలో భక్తులు ఆయనను అసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే ప్రాణాలు వదిలారని వైద్యులు తెలిపారు.

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోగల బలోబల మఠంలో జరిగిన ఈ ఘటన సామాజిక మాద్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి, బసవయోగ మండప ట్రస్ట్ వ్యవస్థాపకుడు అయిన సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం చేస్తున్నారు. ఇంతలో ఆయన హఠాత్తుగా తాను కూర్చున్న కుర్చీలోనే వెనక్కు ఒరిగి శివైక్యమయ్యారు. స్వామిజీ వెనక్కు ఒరిగిపోవడంతో భక్తులు అందోళన చెందారు.

పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమైమ్యారు. ఆయనకు కింద పడుకోబెట్టి గుండెను పనిచేసేలా ప్రాథమికంగా చర్యలు చేపట్టారు. మఠంలోని సిబ్బంది సహా పలువురు భక్తులు స్వామిజీని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు వదిలేసారని వైద్యులు తెలిపడంలో భక్తజనుల్లో విషాదం అలుముకుంది. కాగా, స్వామీజీ జన్మదిన ప్రసంగాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న కొందరు భక్తులు ఈ దృశ్యం రికార్డు చేశారు. స్వామి నిర్యాణ్యం అయిన తరువాత దానిని సామాజిక మాధ్యమాల్లోకి అప్ లోడ్ చేయగా, భక్తులు వీక్షణతో ఆ వీడియో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles