SC says court cannot look into day-to-day affairs of temple ‘‘నిత్య కైంకర్యాల విషయంలో తాము జోక్యం చేసుకోలేం’’

Supreme court says court cannot look into day to day affairs of temple

andhra pradesh high court, constitutional court, nv ramana, supreme court, the supreme court said, tirumala tirupathi devasthanam, venkateshwara swamy, yekanta utsavalu, Constitutional Court, Daily Rituals, Temple, Supreme Court, Tirpuati Tirumala Temple Case, TTD

“A Constitutional Court cannot look into day-to-day affairs of a temple,” said the Chief Justice of India NV Ramana while disposing of the plea filed by a devotee Venkateshwara Swamy of Tirumala Tirupathi Devasthanam against the dismissal of his writ petition by Andhra Pradesh High Court alleging certain irregularities in conducting pooja at the temple.

‘‘నిత్య కైంకర్యాల విషయంలో తాము జోక్యం చేసుకోలేం’’: సుప్రీంకోర్టు

Posted: 11/16/2021 06:01 PM IST
Supreme court says court cannot look into day to day affairs of temple

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో నిర్వహిస్తున్న ఆర్జిత సేవలు, మహా లఘు దర్శనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాలు నిబంధనల మేరకు జరగడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. రోజువారి కైంకర్యాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తేల్చిచెప్పంది. కాగా ఆలయ పాలకవర్గం నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించడం, లేదా ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా తాము జోక్యం చేసుకోగలమని తెలిపింది.

ఈ అంశాలలో మాత్రమే తాము జోక్యం చేసుకునేుందుకు అవకాశం ఉందని, వీటి విషయంలో పాలక మండలి నుంచి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరగలమని తెలిపింది. అంతేకానీ రోజువారి కైంకర్యాల విషయంలో తమ జోక్యం అక్షేపనీయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో సదరు పిటీషనర్ సంబంధిత ఆగమశాస్త్ర పండితులకు సంఘాలను కలవాలని తెలిపింది. కు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, పూజలు, కైంకర్యాలు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని టీటీడీ అఫిడవిట్ సమర్పించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది. టీటీడీ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.

 పిటిషనర్ తీరు చూస్తుంటే ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఆలయాలకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలను న్యాయస్థానాలు చేపట్టవన్న విషయం పిటిషనర్ గుర్తెరగాలని హితవు పలికింది. ఆలయాల్లో పూజలు, ఇతర కైంకర్యాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులకు సంబంధించిన విషయం అని స్పష్టం చేసింది. అయితే, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పిటీషనర్ శ్రీవారి దత్త అనే భక్తుడికి ఎనమిది వారాల్లోగా సమగ్ర సమాధానాన్ని అందించాలని టీటీడీకి అదేశించింది. పూజా కైంకర్యాలపై సూచనలను టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరంను ఆశ్రయించాలని అటు పిటిషనర్ కు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Constitutional Court  Daily Rituals  Temple  Supreme Court  Tirpuati Tirumala Temple Case  TTD  

Other Articles