Parachute rope snaps mid-air, couple crashes into sea పారాసెయిలింగ్ లో గుజారత్ జంటకు భయానక అనుభవం..

Parachute rope snaps mid air during parasailing in diu couple crashes into sea

Gujarat couple life guards Diu, Parachute rope snaps mid-air, parasailing video, parasailing horror, parasailing viral video, gujarat couple parasailing, parasailing dangerous, Nagoa beach in Diu, parachute rope snaps in diu, parachute rope snap caught on cam, Ajit Kathad, Sarla, Uncontrolled parachute, Mangrol taluka, Junagadh, Mid-air, parasailing, scare, caught, on cam, Diu, crime

A shocking accident caught on camera as a couple falls into the sea while parasailing in Diu. The rope of the parachute snapped mid-air as the couple was parasailing. The incident was reported near Nagoa beach in Diu. The Gujarat couple, who were on a holiday, crashed into the sea, as per reports.

ITEMVIDEOS: పారాసెయిలింగ్ లో జంటకు భయానక అనుభవం.. తృటితో తప్పిన ప్రమాదం..

Posted: 11/17/2021 12:59 PM IST
Parachute rope snaps mid air during parasailing in diu couple crashes into sea

విహారయాత్రకు సముద్రతీరానికి వెళ్లిన ఒక జంటకు అక్కడ భయానక అనుభవం ఎదురైంది. జీవితంలో ఒక్కసారైన ధ్రిల్లింగ్ అనుభవాన్ని చవిచూడాలని భావించిన ఆ జంట తమ బిడ్డతో పాటుగా పారాసైయిలింగ్ రైడ్ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా వారు ఉపయుక్తులు కావడంతో వారి నియంత్రణ రహిత పారాచూట్ గాలిలో ఎగురుతుండగా, పారాచూట్ తాడు అకస్మాత్తుగా తెగిపోవడంతో అత్యంత భయానక అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ మంగ్రోల్ తాలుకాకు చెందిన ఓ కుటుంబం దామన్ అండ్ దియ్యూకు పర్యటించేందుకు వెళ్లింది. దీంతో దియ్యూలో నాగోబా బీచులో ఆదివారం సరదాగా గడింపింది. ఈ క్రమంలో పారాసెయిలింగ్ రైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సరదాగా పర్యటనకు వచ్చామని ఆ జంట తమతో.. జీవితంలో ఓ వినూత్న అనుభవాన్ని.. ధ్రిల్లింగ్ ఎక్స పీరియన్స్ ను అందుకోవాలని ఉత్సాహపడ్డారు. అయితే వారి ఆశించిన ధ్రిల్లింగ్ అనుభవం కాస్తా భయానక సంఘటనగా మారింది. వారు గాలిలో పారా సెయిలింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వారి పారాచూట్ తాడు తెగిపోయింది. దీంతో వారి అరుపులు, కేకలు, పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. అదృష్టం బాగుండి వారు సముద్రంలోనే పడటంతో వారిని సముద్ర లైఫ్ గార్డ్స్ క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని జునాగఢ్ మంగ్రోల్ తాలుకాకు చెందిన ఓ గ్రామ ప్రాథమిక అరోగ్య కేంద్రంలో హెల్త్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న అజిత్ కథాడి, అతని భార్య.. స్థానికంగా ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సరళ, తమ బిడ్డతో పాటు అతని సోదరుడి కుటుంబంతో కలసి దామన్ అండ్ దియ్యూ ఐలాండ్ కు పర్యటనకు వెళ్లారు. డయ్యూలోని నాగోవా బీచ్‌లో పారాసైలింగ్ చేస్తుండగా, కొద్ది నిమిషాలకే, వారి పారాచూట్ తాడు అకస్మాత్తుగా తెగిపోయింది. అదృష్టవశాత్తూ లైఫ్ జాకెట్టు ధరించిన వీరు.. సముద్రంలో పడ్డపోవడంతో గాయాలు కాకుండా బయటపడగలిగారు.

కాగా, సముద్రంలో పడిన వీరిని సముద్ర లైఫ్‌గార్డులు రక్షించారు. ట్విట్టర్ యూజర్ రాహుల్ ధరేచా షేర్ చేసిన ఈ భయంకర వీడియో మొత్తం ఎపిసోడ్ ను క్యాప్చర్ చేసి.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టంట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనపై నెట్ జనుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పారాసైలింగ్ రైడ్‌లో పారాచూట్‌ను పవర్‌బోట్‌కి కనెక్ట్ చేసే తాడు అకస్మాత్తుగా ఎలా పగులగొడుతుందో చూస్తేనే ఇక దాని జోలికి వెళ్లవద్దని అన్నట్లు  చేస్తోందని నెట్ జనులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles