Cops can't seize drunk driver's vehicle: HC డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల సీజ్ కేసు: హైకోర్టు సంచలన తీర్పు

Police can not seize vehicles in drunk driving cases telangana hc

Vehicle Sieze, drunk and drive, Hyderabad drunk and drive case, telangana police, telangana high court, drunk driving, telangana, Crime

The police have no power to seize vehicles of drunk drivers. Instead, they can allow an accompanying person who has not had alcohol, to drive the vehicle. his was stated by Justice K Lakshman of the Telangana High Court in his order after hearing a batch of petitions filed by vehicle owners, who challenged the seizures and the prolonged wait to get them back.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల సీజ్ కేసు: హైకోర్టు సంచలన తీర్పు

Posted: 11/06/2021 11:11 AM IST
Police can not seize vehicles in drunk driving cases telangana hc

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్‌ చేయడంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పోలీసుల ఓ అదికారానికి ఈ తీర్పు తాళం వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును వెలువరించింది. వాహనాలు సీజ్‌ చేసే సమయంలో మోటార్‌ వెహికల్‌ చట్టంలోని సెక్షన్‌ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్‌ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో తమ వాహనాలను సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 41 పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ మేరకు తీర్పునిచ్చారు.  ఈ తరహా కేసులలో పట్టుబడిన వాహనానికి సంబంధించిన ఆర్సీ చూపిస్తే ఆ వాహనాన్ని విడుదల చేయాలి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే ఆయన్ను వాహనం నడపకుండా అడ్డుకోవచ్చు. అదే వాహనంలో లైసెన్స్‌ కలిగి మద్యం సేవించని వారు ఉంటే వారికి వాహనాన్ని అప్పగించవచ్చు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ మినహా ఎవరూ లేకపోతే వాహనదారుని బంధువులు లేదా సన్నిహితులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచనలు చేసింది.

ఒకవేళ వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే సమీప పోలీస్ స్టేషన్‌కు ఆ వాహనాన్ని తరలించి సురక్షితంగా ఉంచాలి. వాహన డ్రైవర్‌ మద్యం సేవించారన్న కారణంగా ఆ వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఒకవేళ వాహనదారుడిని ప్రాసిక్యూట్‌ చేయాలని పోలీసులు భావిస్తే వాహనాన్ని సీజ్‌ చేసిన మూడు రోజుల్లోగా సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలి. ఈ మేరకు న్యాయమూర్తులు చార్జిషీట్లను మూడు రోజుల్లో విచారణకు స్వీకరించాలి. కోర్టు విచారణ ముగిసిన వెంటనే సంబంధిత ఆర్‌టీఏకు సమాచారం ఇచ్చి ఆ వాహనాన్ని పోలీసు అధికారులు విడుదల చేయాలి’అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles