టిక్ టాక్ తో పదిమంది గుర్తుపట్టే స్థాయికి వచ్చిన తరువాత అటోమెటిక్ గా వ్యూస్ పెరగడం.. ఫాలోవర్స్ పెరగడం కామన్. అయితే ఒక్కసారి పరపతి వచ్చిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. అలా నిలబెట్టుకున్నవాళ్లు జనం హృదయాలలో నిలిచిపోయారు. కానీ అహంభావంతో వ్యవహరించిన వాళ్లు.. అడ్రస్ కూడా లేకుండాపోయారు. అయితే అంతకుమించి వ్యవహరించిన వాళ్లు మాత్రం ఆనవాళ్లు కూడా లేకుండాపోయారు. అందుకనే సంఘంలో పరపతి వచ్చిన వెంటనే తామున్న స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని పెద్దలు చెబుతుంటారు. ఇక వీరికి పలు విషయాల పట్ల కూడా అవగాహన కలిగివుండాలి. న్యాయస్థానంలో వున్న కేసులపై కూడా అభిప్రాయాలు వెలువరించడం కూడా తప్పే.
అలాంటి విషయాలపై తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పినా శిక్షార్హమే. అయితే ఏకంగా శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చిన ఓ యూట్యూబర్ తాను క్రిమినల్ ను కాదంటూ.. తనపై కేవలం అరోపణలు చేశారని నమ్మబలుకుతూ చేసిన వీడియో.. ఆయనను మరోమారు ఊచలు లెక్కబెట్టేలా చేసింది. కేసుకు సంబంధించిన విషయాలను ఎక్కడా చర్చించని షరతుతో కూడిన బెయిలును పోందిన యూట్యూర్.. కండీషన్స్ ను అతిక్రమించి వీడియో చేయడం.. దానిని నెట్టింట్లో పోస్టు చేయడంతో మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన నిందితుడికి మళ్లీ న్యాయస్థానం రిమాండ్ విధించింది.
వివరా్లలోకి వెళ్తే.. కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్… అనంతరం,యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది. 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి జైలు పాలైన విషయం తెలిసిందే.. చెల్లి చెల్లి అని ఓ బాలికను లోబరుచుకోవడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు.. ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు.
అయితే సుమారు 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న తరువాత బెయిలుపై వచ్చిన భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ వస్తున్నాడు. జైలు నుండి వచ్చిన భార్గవ్, సోషల్ మీడియా వేదికగా తాను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేశారు. కండీషనల్ బెయిల్ పై వచ్చి.. షరతులను మీరడంతో భార్గవ్ పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమో లో పొందుపరిచారు పోలీసులు. దీంతో బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకూ రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. నటుడుగా మంచి భవిష్యత్ ఉన్న భార్గవ్ ఇలాంటి కేసులో ఇరుక్కొని తన జీవితం నాశనం చేసుకున్నాడని కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more