Company gifts evs to employees on Diwali ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

This company offered okinawa e scooters as diwali gift to employees

electric scooters, EVs,electric vehicles, Okinawa, Okinawa PraisePro, PraisePro, Diwali gift, Diwali, Diwali 2021, Central government, Pollution

When the price of petrol and fuel have shot through the roof and pollution has returned to North India, only a few could think of a better Diwali gift than this company based in Surat. Alliance Group, a company which runs business of embroidery machines, decided to offer electric scooters to its employees as Diwali gifts this year.

మంచి బాస్: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Posted: 11/05/2021 09:23 PM IST
This company offered okinawa e scooters as diwali gift to employees

దీపావళి పండగ అంటేనే సంతోషం, ఆనందం. బడా వ్యాపారవేత్తల నుంచి తమ స్థాయి కోద్ది చిన్న, గృహ పరిశ్రమల వరకు అందరూ తమ కార్మికులు, ఉద్యోగులకు బోనస్ లేదా.. కానుకలు అందిస్తుంటారు. ఇక కొన్ని కంపెనీలు స్వీట్లు, టపాసులు కానుకగా అందిస్తాయి. అయితే దేశంలో ఇప్పటికే మనం అనేక కంపెనీలు దీపావళి రోజులన తమ కార్మికులకు కార్లు, ఇత్యాధి కానుకలు కూడా అందించిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ చిన్న కంపెనీ మాత్రం వినేత్న అలోచనతో అందని దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశవ్యాప్తంగా టాక్ అప్ ది టౌన్ గా మారింది.

సూరత్‌కి చెందిన ఈ కంపెనీ యజమాని ఔరా అనిపించేలా తమ కార్మికుల జేబులను ఎప్పుడు ఖాళీ కాకుండదని అలోచించింది. అంతేకాదు అదే సమయంలో పర్యావరణహితం కోసం కూడా అలోచించింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన అలియన్స్‌ సంస్థ తమ కార్మికుల హితం కోసం అలోచించింది. ఎంబ్రాయిడరీ వర్క్‌ చేసే ఈ కంపెనీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. కంపెనీ ఎదుగుదలతో తోడ్పాటు అందించిన ఉద్యోగులకు ఏదైనా చేయాలని ఆ కంపెనీ యజమాని తలిచాడు. దీపావళి పండుగని అందుకు తగిన సందర్భంగా ఎంచుకున్నాడు.

తమ ఆఫీసుకు వచ్చి పోయే ఉద్యోగులకు సౌకర్యంగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఒక్కో ఉద్యోగికి ఓకినావా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని పండగ గిఫ్ట్‌గా అందించాడు. ఒక్క స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధర రూ.76,848లుగా ఉంది. మొత్తం సంస్థలో ఉన్న ముప్రై ఐదు మందికి ఈ స్కూటర్లను అందించాడు. 2 కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓకినావా స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 88 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 58 కి.మీలు. ఒకసారి ఛార్జ్‌ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఈవీల ఉపయోగించం వల్ల కొంతైనా కాలుష్యం కూడా తగ్గుతుంది. అందుకే ఈవీ స్కూటర్లు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాని అలయన్స్‌ డైరెక​‍్టర్‌ సౌరభ్‌ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles