Union Minister earns Rs 4 lakh per month from YouTube యూట్యూబ్‌ ద్వారా కేంద్రమంత్రికి నెలకు రూ.4లక్షలు

I earn rs 4 lakh per month from youtube reveals union minister nitin gadkari

Union Minister, Nitin Gadkari, Road Transport and Highway Ministry, YouTube channel, road projects, Indore, Covid-19 pandemic, cooking videos, lectures videos, online lectures, large audience, Rs 4 Lakh Monthly Income

Nitin Gadkari, Union Minister for Road Transport and Highways, has stated that he earns Rs 4 lakh per month through YouTube channel. While launching and laying the foundation stone for some of the road projects in Indore, he said that he focused on two works during the Covid-19 pandemic.

ITEMVIDEOS: యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.4లక్షలు ఆర్జిస్తున్న కేంద్రమంత్రి

Posted: 09/17/2021 05:01 PM IST
I earn rs 4 lakh per month from youtube reveals union minister nitin gadkari

అందివచ్చిన సాంకేతిక విప్లవాన్ని కూడా ఆదాయ వనురుగా మార్చుకోవడంలో ఎందరెందరో పోటీ పడుతున్నారు. అనుకున్న విధంగానే కొందరి ప్రయత్నాలకు విజయవంతం అవుతూ ఓ వైపు కాసుల వర్షం కురుస్తుండగా మరోవైపు వారికి సమాజంలోనూ సెలబ్రిటీ స్టేటస్ లభిస్తోంది. ఇలా రెండు రకాలుగా తమకు ఆధునిక సాంకేతికత దోహదం చేస్తోంది. ఇక మరోవైపు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కూడా వీరికే అధికంగా వుంటోంది. దీంతో చాలామంది తమ అదృష్టాన్ని అన్ లైన్ లో వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు.

యూట్యూబ్ ఇదే ఇప్పుడు అనేక మందికి కాసులు కురిపించే కామధేనువుగా మారింది. వర్ణం, వర్గం, కులం, గోత్రం, మతం, లింగం, వయస్సుతో పాటు ప్రాంతీయతలకు సంబంధం లేకుండా ఆసక్తికర వీడియోలను పోస్టు చేసిన వారికి కాసులను అందించే కుభేరుడిగా మారింది. దీంతో కొందరు వంటావార్పుల వీడియోలు పెడితే.. మరికోందరు ఫన్నీ వీడియోలు, ఇంకోందరు ప్రాంక్ వీడియోలు.. మరికోందరు న్యూస్ వీడియోలు, సినిమా వీడియోలు.. స్పోర్ట్స్ వీడియోలు, టెక్నాలజీ వీడియోలు, పాఠ్యాంశాల వీడియోలు.. ఇలా అనేకం యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి. ఏ అంశం గురిచి అన్వేషించినా వందల్లో వీడియోలు దర్శనమిస్తుంటాయి.

ఇలా వీడియోలను పోస్టు చేసి లక్షల రూపాయలను అర్జించేవారు ఎందరో వున్నారు. ఇక యూట్యూబర్ గా చెలమణి కావడం కోసం ఉద్యోగాలకు తిలోదకాలు ఇచ్చినవారు చాలామందే వున్నారంటే అతిశయోక్తి కాదు. తమలో ఉండే టాలెంట్‌ను నిరూపించుకోవడానికి యూత్‌ అంతా యూట్యూబ్‌నే ఎంచుకుంటోంది. అలా అని అందరికీ పెద్ద మొత్తంలో రెవెన్యూ రాకపోవచ్చు. కానీ అదృష్టం ఎప్పుడు వరిస్తుందో.. ఏ వీడియోతో వారి స్టార్ తిరుగుతుందో.. గ్రాప్ ఎగిసిపడుతోందో అంటూ ఎందరెందరో యూట్యూబర్స్ వేచి చేస్తూనేవుంటారు.

ఇక కొందరు జంట పనులపై దృష్టి సారిస్తుంటారు. అయితే రెండు పడవలపై ప్రయాణం చేసతేవారికి కరోనా లాక్ డౌన్  సమయం కలసివచ్చిందనే చెప్పాలి. ఈ లాక్ డౌన్ లో వారు తమలోని ఐడియాలన్నింటినీ వీడియో రూపంలో బయటపెట్టి వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అయితే కరోనా కష్టకాలంలో తాను ఇంట్లోనే ఉంటూ ప్రతీ నెల నాలుగు లక్షల రూపాయలను ఆర్జించినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్  సమయంలో తాను ఇంట్లో ఉంటూ రెండు రకాల  పనులు చేశానని... ఒకటి వంట చేయడం.... రెండోది వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడమని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles