ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆలోచనాత్మక పోస్టులతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టం. కరోనా సమయంలో అటో డ్రైవర్ తన అటోను పలు కంపార్టుమెంట్లుగా విడదీయం.. మొదలు అన్ కాల్ సమయంలో ప్రకృతి సహజ ఈతకొలనులో ఒకసారైన ఈతకొట్టాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. ఇలా మనస్సులకు హత్తుకుపోయేలా కామెంట్లు పెట్టి తన పోస్టులను అకర్షించడంలోనూ అనంద్ మహీంద్ర వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
అయితే అప్పుడప్పుడూ ఆయన తన సంస్థకు సంబంధించిన విషయాలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు. అయితే ఇటీవల ఆయనకు ఎవరో అభిమాని పెట్టినపోస్టును షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో కురిసన భారీ వర్షాలకు రాజ్కోట్ సిటీ వరద నీటితో మునిగిపోయింది. ఊరా లేదా చెరువా అన్నట్టుగా అంతా నీటిమయం అయ్యింది. అయితే, ఆ సమయంలో పోలీసులు ఉన్న మహీంద్రా బొలెరో వాహనం భారీ వరద నీటిలో పడవలగా ఆ కోన నుంచి ఈ కోనకు వెళ్ళింది. అయితే ఈ వీడియోను వేరే వ్యక్తి షేర్ చేయడంతో దానిని ఆనంద్ మహీంద్రా చూసి ఆశ్చర్యపోయారు.
Mahindra Hai to mumkin hai ....
— Harish Dewasi Nainol (@Harish_D_Nainol) September 13, 2021
No Caption Needed
Heads of @CP_RajkotCity@GujaratPolice @CollectorRjt@anandmahindra @MahindraRise #Rajkot #Saurashtra #Jamnagar #rajkotrain pic.twitter.com/RD1B0TWu2x
తాజాగా నేడు అలాంటి మరో వాహనం వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మహీంద్రా థార్ వాహనం చాలా వేగంతో ప్రవహిస్తున్న ఒక ఏరును ఈ కోన నుంచి ఆ కొనకి, ఆ కొన నుంచి ఈ కొనకు దాటింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. "గుజరాత్లో వరద నీటిలో నడిచిన బొలెరో వాహనం గురించి నేను ట్వీట్ చేసిన తర్వాత మీలో చాలా మంది అలాంటి వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి @YouTubeలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక నుంచి మహీంద్రా కంపెనీ కప్ప మాదిరిగా.. (నీటిలోనూ.. నేలపైనా) ఉభయచర వాహనా( MAM)లను మేము తయారు చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అన్నారు.
After I RT’d the tweet about a Bolero in Gujarat wading through flood waters, several of you shared this video that’s circulating on @YouTube I think we may well have to create a new vertical called ‘Mahindra Amphibious Vehicles’ (MAV’s!) pic.twitter.com/UPRLMfVZCk
— anand mahindra (@anandmahindra) September 15, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more