DGP comments on Saidabad accused Raju suicide పల్లకొండ రాజు మృతిపై డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Telangana dgp sensational comments on suicide of saidabad rape accused raju

Saidabad rape case, Saidabad Accused dead, Pallakonda raju, Telangana High Court, Public interest Litigation, Mahender Reddy, Director General of Police, Telangana DGP, Seven Witness, Railway Gangmen, Saidabad rape, Pallakonda raju dead, custodial death, Railway tracks, station Gahanpur, Pallakonda raju encounter, Hyderabad rape, Telangana, Crime

Mahender Reddy, the Director General of Police in Telangana in a Press Meet on Friday stated that making unfounded accusations against the Police was improper and added that there is no need for cops to lie. Hyderabad DGP has rejected concerns about the manner of death of Pallakonda Raju, the only culprit in the rape and murder of a six-year-old girl.

ITEMVIDEOS: సైదాబాద్ నిందితుడు పల్లకొండ రాజు మృతిపై డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Posted: 09/17/2021 06:11 PM IST
Telangana dgp sensational comments on suicide of saidabad rape accused raju

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన అరేళ్ల చిన్నారి హ‌త్యాచారం కేసులో నిందితుడు రాజు నిన్న ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ప్రజాసంఘాల ప్రతినిధులు తమ వినతిపత్రాన్ని ఇచ్చి.. రాజు అంత్యక్రియలను నిలిపివేయాలని.. సుప్రీంకోర్టు అదేశాల మేరకు మరోమారు పోస్టుమార్టం చేయాలని కోరారు. కాగా, ఇవాళ రాజుది ఆత్మహత్య కాదని, కస్టోడియల్ మరణంగా అనుమానాం ఉందని పేర్కోంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశారు.  

ఈ క్రమంలో మావోయిస్టు నేత శారదక్క లొంగుబాటు సమావేశం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే ఒక స్టేట్ మెంట్ ఇచ్చే ముందు జవాబుదారి తనంలో వ్యవహరించాలని.. అంతేతప్ప అసత్యకథనాలను తాము చూసినట్లుగా చెప్పడం సహేతుకం కాదని అన్నారు. ఎవరివద్దనైనా అధారాలు వుంటే మాట్లాడాలని డీజీపీ అన్నారు. రాజు ఆత్మహత్యపై అనుమానాలొద్దని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాజు ఆత్మహత్య చేసుకొంటున్న సమయంలో ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని ఆయన తెలిపారు.

శుక్రవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన ఇద్దరు డ్రైవర్లు. ముగ్గురు రైతులు, ఇద్దరు గ్యాంగ్ మెన్లు సాక్షులుగా ఉన్నారని డీజీపీ వివరించారు.సాక్షుల స్టేట్‌మెంట్   వీడియో రికార్డు చేసినట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాజు ఆత్మహత్యపై ఘణపూర్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో డ్రైవర్లు ఇద్దరు ఘటనను అధికారికంగా రికార్డు చేశారని డీజీపీ చెప్పారు. రాజు ఆత్మహత్యపై అనవసర రాద్దాంతాలు వద్దని ఆయన తేల్చి చెప్పారు.ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మాట్లాడాలని డీజీపీ కోరారు.తప్పుదోవపట్టించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles