DSP detained for sexual gestures with woman PC చిన్నారి ఎదురుగానే డీఎస్పీ కామకలాపాలు

Dsp hiralal saini arrested after engaging in sexual gestures with woman pc

Hiralal Saini, Hiralal Saini Swimming Pool Video, Hiralal Saini Viral Video, Jaipur, Rajasthan Police, RPS Officer, RPS Officer Swimming Pool Video, RPS Officer Viral Video, Udaipur resort, viral video, woman constable

Rajasthan police has detained RPS officer Hiralal Saini from Udaipur after a viral video showed him engaging in sexual gestures along with a woman constable in a swimming pool in the presence of her six-year-old son. The officer allegedly was seen making obscene gestures with the constable's son in the video that went viral.

చిన్నారి ఎదురుగానే మహిళా కానిస్టేబుల్ తో డీఎస్పీ కామకలాపాలు

Posted: 09/11/2021 01:54 PM IST
Dsp hiralal saini arrested after engaging in sexual gestures with woman pc

ఎవరు తప్పు చేసినా.. వారికి చట్టాన్ని చెప్పి.. తప్పును ఎత్తిచూపి మంచి చెడులను వివరించే పని చేసేవారు పోలీసులు. ఇక అందులో పోలీసు ఉన్నతాధికారులైతే.. ఒకటి రెండు మంచి సూక్తులు చెప్పి మరీ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వారు చట్టాలు అవపోనస పట్టివుంటారని, వారికి ఎదురు చెప్పలేరన్న విషయం కూడా వారికి తెలుసు. వారికి ఎదురు సమాధానం చెప్పితే ఏం జరుగుతుందో కూడా అవతలివారికి తెలుసు. అలాంటి బాధ్యతాయుతమైన పోలీసు ఉన్నతాధికారి.. ఇతరులకు మార్గదర్శంగా ఉండాలి. కానీ ఈ అధికారి…సరససల్లాపాల్లో మునిగి తేలారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి ఎదుటే మహిళతో రాసలీలలు కొనసాగించారు.

సదరు మహిళ కూడా కానిస్టేబుల్ కావడం గమనార్హం. జలకాలాడుతూ..తాము చేసుకున్న రోమాన్స్ ను వాట్సాప్ స్టేటస్ గా ఆ మహిళ పెట్టుకోవడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దాడులు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీగా హీరాలాల్ పనిచేస్తున్నారు. జైపూర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహళా కానిస్టేబుల్ తో కలిసి జులై 13వ తేదీన ఉదయ్ పూర్ లో ఉన్న ఓ రిసార్ట్ కు వెళ్లారు. అక్కడ సిమ్మింగ్ పూల్ లో జలకాలాడారు. ఈ సమయంలో ఓ చిన్నారి కూడా ఉంది.

ఈ చిన్నారి.. మహిళా కానిస్టేబుల్ కొడుకు.. బాలుడ్ని కూడా వెంట తీసుకువచ్చిన అమె.. చిన్నారి ఎదురుగానే డీఎస్పీతో శృంగారంలో మునిగితేలింది. అర్ధనగ్నంగా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇదంతా…ఓ మహిళా కానిస్టేబుల్ తన ఫోన్ లో వీడియో తీసుకుంది. అనంతరం వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంది. అంతే..వెంటనే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆ రిసార్ట్ పై దాడులు చేసి అధికారితో పాటు..కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేపడుతున్నారు. వీరిద్దరినీ పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles