UIDAI Opposes Aadhaar number change Plea In Delhi HC ఆధార్ లో ఆ మార్పు చేయలేం: స్పష్టం చేసిన ఉడాయ్

Uidai opposes plea for changing aadhaar number before delhi high court

Delhi high court, Aadhar number, existing users, Aadhar act, Unique Identification Authority of India (UIDAI), Justice Rekha Palli, fancy number, number plates

The Unique Identification Authority of India (UIDAI) opposed a plea filed before the Delhi High Court, seeking mechanism and procedure for issuance of new Aadhar numbers to existing users in terms of Section 23 (n) of the Aadhaar (Targeted delivery of financial and other subsidies and service) Act, 2016. It will create a situation like "fancy number plates on cars" if such a prayer is allowed, the Authority told Justice Rekha Palli.

ఆధార్ లో ఆ మార్పు చేయలేం: హైకోర్టుకు స్పష్టం చేసిన ఉడాయ్

Posted: 09/11/2021 12:57 PM IST
Uidai opposes plea for changing aadhaar number before delhi high court

ప్రజలకు ఇప్పటికే కేటాయించిన ఆధార్ నెంబరును మార్చడంపై ఢిల్లీ హైకోర్టుకు ఆధార్ ప్రాధికార సంస్థ (ఉడాయ్) క్లారిటీ ఇచ్చింది. తనకు కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చాలంటూ ఓ వ్యాపారి కోర్టుకెక్కిన కేసులో ఉడాయ్ కీలక ప్రకటన చేసింది. ఒకసారి కేటాయించిన సంఖ్యను మార్పు చేసి కొత్తది కేటాయించడం జరగబోదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకసారి ఇలాంటి వాటికి అనుమతిస్తే ఇది అలవాటుగా మారుతుందని, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లలా తమకు కూడా ఫ్యాన్సీ నంబరు కేటాయించాలని ప్రతి ఒక్కరు కోరే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఒకసారి ఆధార్ నంబరు కేటాయిస్తే అదే ఫైనల్ అని, అందులో ఎలాంటి మార్పు చేర్పులకు అనుమతించబోమని స్పష్టం చేసింది.

తన ఆధార్ నంబరు గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానం కావడంతో ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి తనకు మొదట కేటాయించిన నంబరును రద్దు చేసి కొత్తది కేటాయించేలా ఉడాయ్‌ను ఆదేశించాలని కోరుతూ ఓ వ్యాపారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ విచారణకు రాగా, ఉడాయ్ తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డుదారులు అందించిన సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మాసనానికి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles