SC denies bail to Delhi Sikh riots convict Sajjan Kumar హేయమైన నేరాల్లో నిందితుడ్ని విఐసీలా చూడలేం: సుప్రీంకోర్టు

Can t be treated like vip patient top court rejects sajjan kumar plea

Sajjan Kumar, sikh riots, 1984 riots, sajjan kumar jail, supreme court, 1984 anti Sikh riots case, Medanta Hospital, bail plea, medical grounds, National, Politics

The Supreme Court on Friday refused to grant interim bail to Sajjan Kumar, the 1984 anti-Sikh riots case convict and former Congress MP who is serving a life term. He had sought interim bail on medical grounds but the court noted that his condition is stable and improving, and appeared incredulous as it questioned his lawyer's plea - that he be treated at Medanta Hospital at his own cost.

హేయమైన నేరాల్లో నిందితుడ్ని విఐసీలా చూడలేం: సుప్రీంకోర్టు

Posted: 09/03/2021 03:23 PM IST
Can t be treated like vip patient top court rejects sajjan kumar plea

1984లో జ‌రిగిన సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల కేసులో మాజీ ఎంపీ స‌జ్జ‌న్ కుమార్ జైలుశిక్ష అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఇవాళ సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మెడిక‌ల్ గ్రౌండ్స్‌పై మ‌ధ్యంతర బెయిల్ ఇవ్వాల‌ని పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. స‌జ్జ‌న్ కుమార్ ఆరోగ్య నిల‌క‌డ‌గా ఉంద‌ని కోర్టు చెప్పింది. 75 ఏళ్ల మాజీ కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్ ఆరోగ్యం స‌రిగా లేద‌ని, గుర్గావ్‌లో ఉన్న మెదాంత హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స ఇప్పించాల‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ఆ స‌మ‌యంలో కోర్టు సీరియ‌స్ అయ్యింది.

సజ్జన్ కుమార్ చాలా హేయ‌మైన నేరాల్లో నిందితుడ‌ని, ఆయ‌న్ను ఓ వీఐపీలా చూడాలా అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఢిల్లీలోని రాజ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో స‌జ్జ‌న్ కుమార్ జీవిత‌కాల శిక్ష అనుభ‌విస్తున్నారు. అత్యంత కిరాతంగా అయిదుగుర్ని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 2018 డిసెంబ‌ర్ నుంచి స‌జ్జ‌న్ కుమార్ ప‌ది కిలోల బ‌రువు త‌గ్గార‌ని, ఆయ‌న్ను త‌క్ష‌ణ‌మే రిలీజ్ చేయాల‌ని న్యాయ‌వాది కోరారు. అయితే స‌జ్జ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబ‌ర్ ఆర‌వ తేదీ లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని కోర్టు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles