'Rights of Muslims in Kashmir' Twisted: Taliban కాశ్మీర్ అంశంలో మాటమార్చిన తాలిబన్లు.. అధికారం చేపట్టబోతూ..

Taliban claim they have right to speak for muslims in kashmir

Afghanistan, Talibans, Kashmir, India, Pakistan, Taliban Government, Taliban on Kashmir muslims, Taliban, kashmir muslims, Suhail Shaheen, afghanistan, india Taliban-Pakistan relations, Taliban news, Kashmir muslims, current affairs, Taliban latest news

Amid concerns in India that Afghan soil under the Taliban regime can be used for terrorist activities against it, the insurgent group has said it has the right to speak out in favour of Muslims anywhere, including in Kashmir, though it does not have a policy of conducting “armed operations” against any country.

కాశ్మీర్ అంశంలో మాటమార్చిన తాలిబన్లు.. అధికారం చేపట్టబోతూ..

Posted: 09/03/2021 02:33 PM IST
Taliban claim they have right to speak for muslims in kashmir

తాలిబ‌న్లు మ‌రోసారి మాట మార్చారు. ఆఫ్ఘ‌నిస్థాన్ ను తమ ఆధీనంలోకి తీసుకునే తరుణంలో చేసిన వ్యాఖ్యలకు.. అధికారాన్ని చేపట్టబోతున్న తరుణంలో చెబుతున్న మాట‌ల‌కు మధ్య వ్యత్యాసం కొట్టేచ్చినట్టుగా కనబడుతోంది. కాశ్మీర్ అంశాన్ని తాము భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న అంతర్గత సమస్యగా చూస్తామని ఇటీవల చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని ఇప్పుడు తాజాగా మరో గళాన్ని వినిపిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ ల ద్వైపాక్షిక అంశ‌ం అని చేసిన వ్యాఖ్యలు కాస్తా.. హక్కుగా మార్చేశాయి. రేవు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడ మల్లన్న అన్న చందంగా తాలిబన్లు మాటమార్చారు.

కాశ్మీర్ అంశాన్ని సరిహద్దు అంశంగానే పరిగణించిన తాలిబన్లు.. అధికారం చేపట్టబోతున్న తరుణంలో మాత్రం ఈ అంశాన్ని ముస్లిమ్.. ముస్లిమేతర సమస్యగా చూడటం గమనార్హం. కాశ్మీర్ లోని ముస్లింల గురించి మాట్లాడే హ‌క్కు త‌మ‌కుంద‌ని అనడం గ‌మ‌నార్హం. కాశ్మీర్ విషయంలో తాలిబన్ల సాయం తీసుకుంటామని గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ నేతలు చెప్పినట్టు గానే తాలిబన్లు కూడా మాటమార్చారు. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి సుహైల్ ష‌హీన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఈ హ‌క్కు మాకుంది. ముస్లింలుగా క‌శ్మీర్‌, ఇండియా స‌హా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు మాకు ఉంది అని ష‌హీన్ అన్నాడు.

అయితే ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్ట‌బోమ‌ని కూడా అత‌ను స్ప‌ష్టం చేశాడు. ముస్లింలు మీ సొంత మ‌నుషులు, మీ దేశ పౌరులు. మీ చ‌ట్టాల ప్ర‌కారం వాళ్ల‌కు కూడా స‌మాన హ‌క్కులు ఉండాల‌ని మేము గ‌ళ‌మెత్తుతాం అని ష‌హీన్ చెప్పాడు. ఆఫ్ఘ‌న్ భూభాగం ఇండియా వ్య‌తిరేక ఉగ్ర‌వాద శ‌క్తుల అడ్డాగా మార‌కూడ‌ద‌ని ఈ మ‌ధ్య తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. ఖ‌తార్‌లో ఇండియా రాయ‌బారి దీపిక్ మిట్ట‌ల్ తాలిబ‌న్ నేత షేర్ మ‌హ్మ‌ద్‌ను క‌లిసి ఈ విష‌యాన్ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వాళ్ల నుంచి క‌శ్మీర్‌పై ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles