న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఉన్న ఓ సూపర్ మార్కెట్ లో ఇవాళ ఉగ్రదాడి జరిగినట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ఆరుగురిన్ని కత్తితో పొడిచిన ఆ ఉన్మాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వెల్లడించారు. శ్రీలంకకు చెందిన ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు ఆమె చెప్పారు. కత్తిదాడి జరిగిన 60 సెకన్ల లోపే ఆ ఉన్మాదిని హతమార్చినట్లు ప్రధాని జెసిండా తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి 2011లో న్యూజిలాండ్ కు వచ్చాడని, 2016 నుంచి అతనిపై జాతీయ భద్రతా దళం నిఘా పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆ ఉన్మాది భావజాలం విపరీతంగా ఉన్న నేపథ్యంలో అతనిపై నిఘా పెట్టినట్లు జెసిండా తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉన్మాది సూపర్ మార్కెట్ లో కత్తితో బీభత్సం సృష్టించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉన్మాది దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ సూపర్ మార్కెట్ లో వున్న కస్టమర్లు సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అటూ ఇటూ పరుగులు తీశారన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సూపర్ మార్కెట్లో భీతావాహ వాతావరణం అలుముకుందని, కస్టమర్లు అరుపులు, కేకలు పెట్టారన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ వ్యక్తి కత్తిపోట్లతో కిందపడిపోయినట్లు ఒకరు తెలిపారు. న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్ మాల్ నుంచి జనం భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు ఆన్ లైన్‌లో వైరల్ అయ్యాయి.
కాగా ఈ దాడిలో గాయపడిని ఆరుగుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లగా, దాంట్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్న ఆ ఉన్మాదికి ఇటీవల 12 నెలల శిక్ష పడింది. అభ్యంతరకర వస్తువులను కలిగి ఉన్న కేసులో ఆ శిక్షను విధించారు. కేవలం ముస్లింను కావడం వల్లే తనను వేధిస్తున్నట్లు ఆ వ్యక్తి కోర్టుకు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఇంటర్నెట్ సెర్చ్‌ను పోలీసులు పరిశీలించారు. దాంట్లో ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్ గురించి అతను సెర్చ్ చేసినట్లు తెలిసింది. వాళ్లు ధరించే దస్తులు, జెండాలు, వాడే ఆయుధాలు, ఇస్లామిక్ హీరోలు ఎవరని సెర్చ్ చేసినట్లు కూడా తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more