Apollo Pharmacy halt services after cyber attack అపోలో ఫార్మసీ కంప్యూటర్లపై సైబర్ నేరగాళ్ల దాడి..

Apollo pharmacy resume services with alternative software after cyber attack

Apollo Pharmacy, Ransomware, 8 thousand computers, pharmacy computers, cyber attack, Hackers, Hyderabad cyber crime police, Hyderabad, Crime

Apollo Pharmacy had been attacked by cyber criminals which led to halt its services. The managment has resume services within hours with the help of alternative software after cyber attack.

అపోలో ఫార్మసీపై సైబర్ నేరగాళ్ల దాడి.. ప్రత్యామ్నాయంతో సేవల పునరుద్దరణ

Posted: 08/31/2021 10:37 AM IST
Apollo pharmacy resume services with alternative software after cyber attack

సైబర్ నేరగాళ్లు బరిదెగించిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. ఇప్పడు దేశీయంగా వున్న చైయిన్ సంస్థలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను టార్గెట్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో లబ్దిపోందాలన్న కుయుక్తులతో హ్యాకర్లు దేశవ్యాప్తంగా వున్న ప్రముఖ సంస్థలను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా అనేక శాఖలతో బాసిల్లుతూ.. కస్టమర్లకు డిస్కౌంట్ ధరపై ఔషధాలను విక్రయిస్తున్న అపోలో ఫార్మసీ చెయిన్ సంస్థలపై సైబర్ నేరగాళ్లు దాడికి పాల్పడ్డారు.

అపోలో ఫార్మసీకి చెందిన ఏకంగా 8 వేల కంప్యూటర్లకు ర్యాన్సమ్ వేర్ పంపించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఫార్మసీ సిబ్బందితో పాటు అన్ లైన్ వ్యవహరాలు చూసుకునే బ్యాక్ ఆఫీస్ సిబ్బంది కూడా విస్మయానికి గురయ్యారు. దీంతో కొన్ని గంటల పాటు ఫార్మసీ సేవలకు ఆటంకం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అపోలో ఐటీ నిపుణులు ఫార్మసీ సేవలను పునరుద్దరించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తున్న తమ చెయిన్ సంస్థలపై ఎప్పటికైనా హ్యాకర్ల దాడి జరుగుతుందని ముందుగానే ఊహించిన ఐటీ నిపుణులు.. ఇలాంటి తరుణంలో తాము అనుసరించాల్సిన వ్యూహాలను కూడా సిద్దం చేసుకున్నారు.

రంగలోకి దిగిన అపోలో ఫార్మసీ ఐటీ నిపుణుల బృందం ప్రత్యామ్నాయ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసి.. నిమిషాల వ్యవధిలోనే సేవలను పునరుద్ధరించింది. ఆ తరువాత హ్యాకర్లపై చర్యలు తీసుకోవాలంటూ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ సీనియర్ జనరల్ మేనేజర్ రెడ్డప్ప హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ర్యాన్సమ్ వేర్ కారణంగా తమ డేటా మాత్రం చోరీ కాలేదని తెలిపారు. ఫార్మసీలోని కంప్యూటర్లకు రక్షణగా కే5785, ఫ్రెండ్ మైక్రో అనే యాంటీ వైరస్ ను ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఈ దాడి నేపథ్యంలో దేశంలోని చెయిన్ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. తమకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles