Miscreants break open 2 SBI ATMs in Dhone ఎస్బీఐ ఏటీయంల లూఠీ.. రూ.65 లక్షలతో దొంగల పరార్..

Miscreants break open 2 sbi atms decamp with rs 65 lakh

Dhone, Robbery, State Bank of India, SBI ATMs, Rs 65 Lakh cash, Nehru Nagar, kurnool police, cctv cameras, gas cutters, crowbars, clues team, dog squad, dhone CI Mallikarjuna, Dhone town police station, Andhra Pradesh, crime

Some unidentified persons decamped with Rs 65 lakh cash from two SBI ATMs. The incident took place at Nehru Nagar in Dhone town in the early hours on Monday. Dhone town CI Mallikarjuna told that some miscreants have entered into the SBI ATMs and opened them with gas cutters and crowbars. Prior to that,they destroyed the CC cameras and carried out their operation.

కర్నూలులో రెండు ఎస్బీఐ ఏటీయంల లూఠీ.. రూ.65 లక్షలతో దొంగల పరార్..

Posted: 08/31/2021 11:23 AM IST
Miscreants break open 2 sbi atms decamp with rs 65 lakh

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దోంగలు సవాల్ విసరుతున్నారు. పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వున్న ఏటీయం కేంద్రంలోకి చోరబడి రెండు ఏటీయంలలోని డబ్బును అపహరించుకుపోయారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూనగర్ లో దొంగలు చెలరేగిపోయారు. ఓ ఏటీఎం కేంద్రంలోకి వున్న రెండు ఏటీయంలలో వున్న రూ. 65 లక్షలను దోచుకెళ్లారు. డోన్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. నెహ్రూనగర్ ప్రధాన రహదారిపై ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లోకి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్, గడ్డపారతో రెండు ఏటీఎంలను బద్దలుకొట్టి వాటిలోంచి డబ్బును దొచుకుపోయారు.

అయితే ఏటీయం కేంద్రంలోకి వెళ్లే ముందుగానే అక్కడి సిసిటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన అనంతరం వాటిలోని డబ్బును దోచుకున్నారు. ఏటీఎంలు ధ్వంసమై ఉండడాన్ని నిన్న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు తెల్లవారుజామున 2.56 గంటల సమయంలో దోపిడీ జరిగినట్టు గుర్తించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో బ్యాంకు అధికారులు రూ. 85 లక్షలు నింపి పెట్టారు. ఈ సొమ్ములో రూ. 65,61,900 చోరీకి గురైనట్టు గుర్తించారు.

ఇక చోరీ జరిగిన తీరును బట్టి అనుభవం ఉన్న దొంగలే ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం బయట ఉన్న సీసీటీవీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. లోపలున్న కెమెరాను పక్కకు తిప్పేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడితో పోలీసులకు దోంగలు సవాల్ విసిరారని, అత్యంత చేరువలో పోలిస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం వున్నా.. వారు ఏమాత్రం జంకకుండా తమ పనిని పూర్తి చేసుకుపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhone  Robbery  SBI ATMs  Rs 65 Lakh cash  Nehru Nagar  dhone town police  kurnool district  Andhra Pradesh  crime  

Other Articles