Covid third wave could peak between October-November అవి థర్డ్ వేవ్ కు సంకేతాలేనని ఐసీఎంఆర్ అందోళన

Rise in covid cases in some states indicates 3rd wave icmr

third wave, Indian Council of Medical Research, Covid cases, Coronavirus, Covid third wave in India, ICMR, Covid-19 cases in India, Dr Samiran Panda, corona second wave, corona cases in India, coronavirus india updates

Head of Epidemiology and Communicable Diseases at the Indian Council of Medical Research (ICMR), Dr Samiran Panda, said that the states which did not face an intense second wave of the COVID-19 pandemic are now with the increasing trend of COVID-19 cases, showing early signs of the third wave.

పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల.. థర్డ్ వేవ్ కు సంకేతాలేనని ఐసీఎంఆర్ అందోళన

Posted: 08/31/2021 09:45 AM IST
Rise in covid cases in some states indicates 3rd wave icmr

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తాజాగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎంఆర్‌) అందోళన వ్యక్తం చేసింది. రెండో దశలో పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని అయితే పెరుదుతున్న కేసులు కరోనా మహమ్మారి మూడో దశ (థర్డ్ వేవ్)కు సంకేతాలేనని ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్ట‌ర్ సామిర‌న్ పాండా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌ని తాము ఎప్పుడూ ఊహించ‌లేద‌ని తెలిపారు. పండుగ‌ల సీజ‌న్ లో సామూహిక వేడుక‌ల్లో కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌క‌పోతే అవి సూప‌ర్ స్పెడింగ్ వేడుక‌లుగా మారే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

క‌రోనా సెకండ్ వేవ్ కంటే ముందుగా థ‌ర్డ్ వేవ్ దూసుకొస్తుంద‌ని తెలిపారు. సెకండ్ వేవ్ తీవ్ర‌త ఎక్కువ‌గా చ‌వి చూడ‌ని రాష్ట్రాల్లో ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికిప్పుడు ఆంక్ష‌లు ముంద‌స్తుగా ఉప‌సంహ‌రించొద్ద‌ని సూచించారు. మిజోరం, కేర‌ళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో దేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచే ఉందని, అది అక్టోబరు-నవంబరు మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చనని తేలింది. అయితే, ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా ఏదైనా కొత్త రకం బయటపడితేనే దీని ఉద్ధృతి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలో ఇటీవల సంభవించిన రెండో దశ ఉద్ధృతితో పోలిస్తే మూడో దశ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కూడా స్పష్టం చేశారు.

ఐఐటీ-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు  శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ఉన్న మ్యూటెంట్‌లే మున్ముందూ కొనసాగితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత వేరియంట్లకు భిన్నంగా, ఏదైనా ప్రమాదకర వేరియంట్ పుట్టుకొస్తే మాత్రం థర్డ్ వేవ్ తప్పదని, అప్పుడు రోజుకు గరిష్ఠంగా లక్ష వరకు కేసులు నమోదవుతాయని మనీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే డెల్టా వేరియంట్‌కు మించిన వేరియంట్‌లు లేవని, ఒకవేళ సెప్టెంబరులో అలాంటి వేరియంట్ ఏదైనా పుట్టుకొస్తే అక్టోబరు-నవంబరు మధ్య మూడో దశ తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles