తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన ప్రముఖ జర్నలిస్ట్.. అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంతో పాటు అతని ఇంటిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దాడులు చేసి.. వారం రోజులు కూడా గడువక ముందే.. మరోమారు అయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న అరోపణల నేపథ్యంలో రెండో పర్యాయం అరెస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
డబ్బుల కోసం తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్శర్మ ఏప్రిల్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్ లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి తన ప్రతీష్టకు భంగం కలిగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని లక్ష్మీకాంత్శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల తరువాత నవీన్ పై నమోదైన కేసుపై పోలీసులు కదిలారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అయితే కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా అదేశించారని, అయినా ఆయన నోటీసులను బేఖాతరు చేశారని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే తెలంగాణ యాస, బాషలో వ్యంగోక్తులు విసురుతూ విమర్శనాత్మక శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేసే మల్లన్నకు గత కొంతకాలంగా అధికార పార్టీ టార్గెట్ చేసిందన్న అరోపణలు వున్నాయి. దీంతోనే అయనపై పోలీసుల కేసులు నమోదు కావడం.. ఆయన కార్యాలయాలపై పోలీసుల దాడులు జరగడం పరిపాటిగా మారాయన్న అరోపలూ వున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more