Samyukt Kisan Morcha Calls For 'Bharat Bandh' On Sept 25 రైతు ఉద్యమం: సెప్టెంబర్ 25న భారత్ బంద్ కు ఎస్కేఎం పిలుపు

Farmers protest samyukt kisan morcha calls for bharat bandh on sept 25

farmers protest, farmers protest delhi, farmers bill, farmers protest update, samyukta kisan morcha, opposition farmers, Congress acting president Sonia Gandhi, former prime minister HD Deve Gowda, NCP chief Sharad Pawar, West Bengal CM Mamata Banerjee (TMC), Maharashtra CM Uddhav Thackeray (Shiv Sena), Tamil Nadu CM MK Stalin (DMK), Jharkhand CM Hemant Soren (JMM). former Jammu and Kashmir CM Farooq Abdullah (NC), former Uttar Pradesh CM Akhilesh Yadav (SP), Tejashwi Yadav of the RJD, D Raja of CPI, Sitaram Yechury CPI-M.

The Samyukt Kisan Morcha (SKM), a platform of protesting farm unions, has called for a nationwide strike or Bharat bandh on September 25, one year after Parliament passed the three contentious agricultural reform laws. This comes at the end of a two-day convention at the Singhu border.

రైతు ఉద్యమం: సెప్టెంబర్ 25న భారత్ బంద్.. సంయుక్త్‌ కిసాన్ మోర్చా పిలుపు

Posted: 08/27/2021 06:02 PM IST
Farmers protest samyukt kisan morcha calls for bharat bandh on sept 25

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత సంవత్సరం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో సింఘు, టిక్రీ ప్రాంతాలలో గత ఎనమిది నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిసెంబర్ 26 నుంచి రైతులు తమ సంక్షేమాన్ని కాంక్షించే రైతు సంఘాలతోఈ ఉద్యమాన్ని కోనసాగిస్తునే వున్నారు. చలికి వణుకుతూ, ఎండలకు ఎండుతూ.. వర్షాలకు తడుస్తూ.. ఎట్టిపరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గేది లేదని రైతన్నలు తెగేసి చెబుతున్నారు. ఇక కరోనా లాంటి కష్టకాలంలోనూ రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. దీక్షాస్థలితోనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కోసం దీక్షను వదిలేస్తే.. సాగు బిల్లులతో తమ భవిష్యత్తే అంధకారం అవుతుందని, ఇలాంటి తరుణంలో తాము దీక్షను కొనసాగించేందుకే సముఖంగా వున్నామని రైతులు తెలిపారు. కాగా, ఈ సెప్టెంబర్ 25తో తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చింది. వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా గ‌త ఏడాది నవంబ‌ర్ నుంచి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామ‌ని ఎస్‌కేఎం వెల్ల‌డించింది.

సింఘు బోర్డ‌ర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్‌కేఎం ప్ర‌తినిధి అశీష్ మిట్ట‌ల్ మాట్లాడుతూ భార‌త్ బంద్ వివ‌రాల‌ను తెలిపారు. గ‌త ఏడాది ఇదే రోజున తాము దేశ‌వ్యాప్త బంద్‌ను జ‌రిపామ‌ని గుర్తు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌రిగిన బంద్ కంటే ఈసారి భార‌త్ బంద్ మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు కూడా పలు రాజకీయ పార్టీలు ముందుకు రానున్నాయి. మరీ ముఖ్యంగా యూపీఏ పక్ష పార్టీలు రైతులకు మద్దతు తెలుపనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles