Teacher sentenced to 21 years in prison in kothagudem కీచక గురువుకు తగు శిక్షను విధించిన న్యాయస్థానం..

Teacher sentenced to 21 years in prison for sexually assaulting students

Dodda Sunil Kumar, pocso case, Teacher, Studenets, sexual assault, Laxmidevipally, posco court, kothagudem-Badradri district, Telangana, crime

A Teacher has been sentenced to 21 years in prison for molesting Five Minor Students in Lamxidevipally of Kothagudem-Badradri district in Telangana. The Kothafudem Posco Fast-track Court Sentenced 40 Years old Dodda Sunil Kumar and also imposed Rs. 11000 fine.

కీచక గురువుకు తగు శిక్షను విధించిన కొత్తగూడెం ఫాస్ట్ ట్రాక్ కోర్టు..

Posted: 08/28/2021 12:43 PM IST
Teacher sentenced to 21 years in prison for sexually assaulting students

భావితరాల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు.. చిన్నారులపై కామవాంఛతో అఘాయిత్యాలకు పాల్పడితే.. అభం శుభం తెలియని చిన్నారి మనస్సులో ఎంతగా గాయపడతాయో.. ఊహించ తరం కాదు. ఇక వారికి విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నం చేసే ఇతర ఉపాధ్యాయులపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఇలాంటి గురువు లకు న్యాయస్థానాలు తగు శిక్షను విధించి.. శిక్షకాలంలోనూనా గుణపాఠం నేర్చుకునేలా చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో న్యాయస్థానం అతడికి కఠిన శిక్ష విధించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు శిక్షను ఖరారు చేసింది. నిందితుడు సునీల్‌కుమార్‌ (40)కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ శుక్రవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు దొడ్డా సునీల్‌కుమార్‌ లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. గతేడాది కరోనా వల్ల పాఠశాలలు మూతపడటంతో చదువు పేరిట కొందరు బాలికలను తరచూ పాఠశాలకు రప్పించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.

తమపై లైంగికదాడి జరిగినట్టు ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో కీచక గురువు వ్యవహారం బయటపడింది. దీంతో గతేడాది డిసెంబరు 15న తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడిపై పోక్సో చట్టంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడికి సహకరించారన్న ఆరోపణలపై మరో తొమ్మిది మందిపై లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ అంజయ్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో 24 మంది సాక్షులను జడ్జి విచారించగా, నిందితుడు దొడ్డా సునీల్‌కుమార్‌పై నేరం రుజువయ్యింది. మిగతా తొమ్మిది మందిపై అభియోగాలు రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టేశారు. నిందితుడు సునీల్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.11 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles