Odisha MP Bhartruhari Mahtab, family booked for dowry ఎంపీ బాతృహరి సహా కుటుంబంపై వరకట్నం కేసు

Fir against bjd mp bhartruhari mahtab wife and son over alleged dowry harassment

Bhartruhari Mahtab, Biju Janta Dal, FIR against BJD MP, Bhopal dowry harassment, Bhopal dowry cases, Bhopal harassment case, Bhopal women safety, Mahadev Parisar, Bhopal police, Odisha, crime

Police here have registered an FIR against BJD MP Bhartruhari Mahtab, his wife and their son, after their daughter-in-law alleged harassment for dowry, an official said. The complainant, a resident of Mahadev Parisar locality here in Madhya Pradesh, got married in December 2016 to the son of Mahtab, the Biju Janata Dal MP from Cuttack in Odisha, he said.

ఎంపీ బాతృహరి సహా కుటుంబంపై వరకట్నం కేసు

Posted: 08/19/2021 05:01 PM IST
Fir against bjd mp bhartruhari mahtab wife and son over alleged dowry harassment

 ఒడిశాలో అధికార బీజేడీ పార్లమెంట్‌ సభ్యుడు సహా అతిని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన విషయాన్ని పోలిస్ స్టేషన్ హౌజ్ ఆపీసర్ ధృవీకరించారు. కటక్‌ నుంచి బీజేడీ అభ్యర్థిగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాతృహరి మహతాబ్ పై రాజధాని నగరంలోని మహిళా పోలీస్‌ స్టేషన్ లలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కేసులో ఆయన భార్య మహాశ్వేత, కుమారుడు లోకరంజన్ పై కూడా కేసు దాఖలైంది.

ఎంపీపై వరకట్న వేధింపులతోపాటు రాజద్రోహం, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును భోపాల్ నివాసి, 34 ఏండ్ల బ్రాతృహరి మహతాబ్  కోడలు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. భోపాల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారి అజిత నాయర్ ప్రకారం, భోపాల్ లోని ఎంపీ నగర్ లోని మహాదేవ్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త, బీజేడీ ఎంపీ బ్రాతృహరి మహతాబ్  కుమారుడు లోకరంజన్ మహతాబ్ తో తన వివాహం 2016 డిసెంబర్ నెలలో జరిగింది.

పెండ్లి సమయంలో తన తండ్రి కట్నకానుకలు చాలా ఇచ్చారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తమామలు మరింత కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె చాలాసార్లు పుట్టింటికి వెళ్లింది. 2018 లో ఆమె న్యూఢిల్లీలోని ఏబీ-94 షాజహాన్ రోడ్ లోని తన అత్తమామల ఇంటికి చాలాసార్లు వెళ్లింది. కానీ ఆమెను వారు ఇంట్లోకి రానీయలేదు. ఇంటి తలుపులు కూడా తెరవలేదు. దాంతో ఆమె భోపాల్‌ చేరుకుని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles