Single-dose Sputnik Light vaccine set for launch in September సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి.. స్పుట్నిక్ సింగల్ డోస్ వాక్సీన్..

Sputnik light single dose vaccine set for launch in september priced at rs 750 report

Sputnik Light, Sputnik Light vaccine, Sputnik Light launch date, Sputnik Light price, Sputnik Light price in india, Sputnik Light efficacy, Sputnik Light launch date in india, Sputnik Light production india

In a shocking incident, a woman had a narrow escape from a major accident after she slipped while boarding a moving train in Indore railway station on August 17. According to the officials, the lady passenger was trying to board the train along with a man and a child.

ITEMVIDEOS: సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి.. స్పుట్నిక్ సింగల్ డోస్ వాక్సీన్..

Posted: 08/19/2021 04:13 PM IST
Sputnik light single dose vaccine set for launch in september priced at rs 750 report

సింగిల్‌ డోస్‌ కరోనా టీకా స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (RDIF)తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్‌ స్పుత్నిక్‌ లైట్‌ అత్యవసర వినియోగం కోసం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్‌ ధర రూ.750 ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఏప్రిల్‌ 12న అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ 65 దేశంలో వినియోగిస్తున్నారు. భారత్‌లో మేలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రష్యన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

పరాగ్వేలో స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్‌డీఐఎఫ్‌ బుధవారం తెలిపింది. రష్యాలో మే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అధికారం పొందిన సమయంలో 79.4 శాతం సామర్థ్యాన్ని చూపిందని ఆర్‌డీఐఎఫ్‌ హెడ్‌ కిరిల్‌ డిమిత్రివ్‌ పేర్కొన్నారు. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ 11 ఆగస్ట్‌, 2021న రష్యా ఆమోదించగా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన మొదటి కొవిడ్‌ వ్యాక్సిన్‌గా నిలిచింది. టీకా అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫారమ్‌లో టీకాను తయారు చేశారు. వ్యాక్సిన్‌ 97.5శాతం ప్రభావంతంగా పని చేస్తుందని మేలో ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించింది. మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ సైతం స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తెలిపింది.

స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ రష్యా, యూఏఈ, ఘనాతో పాటు ఏడు దేశాల్లో జరిగాయి. కొవిడ్‌ అన్ని వేరియంట్లపై వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పని చేస్తుందని గమలేయా సెంటర్‌ తెలిపింది. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ రెండు డోసుల టీకా కాగా.. లైట్‌ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ టీకా. వ్యాక్సిన్‌ ప్రభావం రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. సింగిల్‌ డోస్‌ కావడంతో టీకాలు వేసేందుకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌ దీప్‌ కాంగ్‌ మాట్లాడుతూ సమర్థవంతమైన డేటాతో వ్యాక్సిన్‌ను ఆమోదిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.

ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు సహాయకరంగా ఉంటుందన్నారు. సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ దీర్ఘకాలిక ప్రభావం కోసం వాస్తవ ఫలితాలను చూడాలన్నారు. ఇదిలా ఉండగా.. డ్రగ్ రెగ్యులేటర్ సబ్జెక్ట్ నిపుణుల కమిటీ రష్యాలో నిర్వహించిన ట్రయల్స్ డేటాను సమర్పించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో స్పుత్నిక్ లైట్ అనుమతి కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. భారత్‌లో ఏటా వంద మిలియన్ డోసుల స్పుత్నిక్ వీ తయారు చేయాలని లక్ష్యం కాగా.. డాక్టర్ రెడ్డీస్‌ ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  RDIF  Russia Vaccine  September  Single Dose vaccine  Sputnik Light vaccine  

Other Articles