Karvy chairman arrested for defaulting bank loan కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్

Karvy group promoter c parthasarathy held for defaulting on bank loan

bank loan fraud, Hyderabad news, Karvy Stock Broking, C Parthasarathi, Bank Loan, karvy chairman,HDFC Bank, IndusInd Bank, Stock Broking, Hyderabad, SEBI, crime

One of the promoters of scam-hit Karvy Group, was arrested on charges of defaulting a bank loan, police said. C Parthasarathy was arrested for defaulting on a loan taken from the IndusInd bank in 2019 and diverting the fund to other bank accounts,

చీటింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్

Posted: 08/19/2021 07:56 PM IST
Karvy group promoter c parthasarathy held for defaulting on bank loan

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు న‌గ‌రాలో ప‌లు ర‌కాల ఆర్థిక సేవ‌లు అందిస్తున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ పార్ధసార‌ధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నార‌ు. ఆర్థిక నేరస్థుడు.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా తరహాలో పార్థసారధి కూడా బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని ఉద్దేశపూర్వకంగా వాటిని తిరిగి చెల్లించ‌లేద‌ని ఆరోప‌ణ‌ల నేపథ్యంలో ఆయనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించి తాను తీసుకున్న రుణాల‌ను అక్ర‌మంగా వాడుకున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  

కార్వీ సంస్థ పేరున రుణాలను పోందిన ఆయన వాటిని ఎగవేసేందుకు యత్నించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోందిన రుణాలను స‌కాలంలో నెలవారి వాయిదాలు చెల్లించ‌క‌పోవ‌డంతో హెచ్డీఎఫ్‌సీ, ఇండ‌స్ ఇండ్ బ్యాంకుల అధికారులు హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కాగా పార్థసారధి హెచ్డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రూ. 650 కోట్ల రుణంతో పాటు ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ.137 కోట్ల మేర రుణం తీసుకుందని సమాచారం. కాగా, రుణాల చెల్లింపుల్లో జాప్యంపై ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది.

కార్వీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పార్ధ‌సార‌ధి మొత్తంగా బ్యాంకుల నుంచి రూ.780 కోట్ల మేర‌కు రుణాలు పొందిన తరువాత వాటిని బ్యాంకు అవసరాలకు కాకుండా ఇతరాత్రలకు వినియోగించినట్లు స‌మాచారం. దీంతో నిధుల మళ్లింపు విషయమై బ్యాంకు అధికారులు పోలీసులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులకు కార్వీ సంస్థలోని కస్టమర్లకు చెందిన నిధులు కూడా దారిమళ్లిన విషయం తెలుసుకున్నారు. రూ.720 కోట్ల క‌స్ట‌మ‌ర్ల నిధుల‌ను కూడా తారుమారు చేశార‌ని ఆయ‌న‌పై అభియోగాలు ఉన్నాయి. ఇంత‌కుముందు షేర్ల అక్ర‌మ లావాదేవీల‌కు పాల్ప‌డినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీ.. గ‌తంలో కార్వీపై నిషేధం విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karvy Group  C Parthasarathy  HDFC Bank  Bank Loan  karvy chairman  Stock Broking  Hyderabad  crime  

Other Articles