Om Prakash Chautala appears for Class 10 English exam పదో తరగతి ఆంగ్ల పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి

Former haryana cm om prakash chautala appears for class 10 english exam

om prakash chautala, haryana former cm, class 10 exam, class 12 exam, English Exam, Haryana, Politics

Om Prakash Chautala, former chief minister of Haryana, appeared for his Class 10 English subject examination on Wednesday. He wrote the paper at Arya Kanya Senior Secondary School in Sirsa.

పదో తరగతి ఆంగ్ల పరీక్ష రాసిన మాజీ ముఖ్యమంత్రి

Posted: 08/18/2021 10:50 PM IST
Former haryana cm om prakash chautala appears for class 10 english exam

హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా వార్తల్లో వ్యక్తిగా మారారు. అదేంటి.. అంటారా.. రాజకీయాల్లో నిత్యం బిజీగా వుంటే ఆయన ఓ పరీక్ష కోసం అహర్నిషలు కష్టపడి.. రాయడంతో ఆయన వార్తలోని వ్యక్తిగా మారారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నగరా మోగనుందని.. ఈ తరుణంలో ఆయన రాజీకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోనడానికి పరీక్షలను ఎదుర్కోంటున్నారని భావిస్తున్నారా..? తన పార్టీని ఈ సారి అధికారంలోకి తీసుకురావడమే ఆయన ముందున్న తక్షణ పరీక్ష అనుకుంటున్నారా..? అయితే అది పోరబాటే.

ఎందుకంటే ఆయన తన పదో తరగతి (మెట్రిక్యులేషన్) ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్‌లో బుధవారం ఆయన ఈ పరీక్ష రాశారు. 86 ఏళ్ల చౌతాలా గతంలో జేబీటీ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. తన జైలు జీవితాన్ని ఆయన మెట్రిక్యులేషన్ చదువు కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఆ కోర్సులో ఇంగ్లిష్ పరీక్ష మిస్సయ్యారు. దానినే ఇప్పుడు ఆయన రాసి ఉత్తీర్ణులవ్వాలని భావించారు. అందుకోసం ఇటీవల ధరఖాస్తు చేసుకుని ఇప్పుడు పరీక్ష రాశారు.

మాజీ సీఎం చేతికి గాయమైందని, కాబట్టి ఆయనకు పరీక్ష రాయడం కోసం సహాయకుడిని అనుమతించామని బీఎస్ఈహెచ్ సెక్రటరీ హితేందర్ కుమార్ తెలిపారు. ఆమధ్య భివానీ ఎడ్యుకేషనల్ బోర్డులో ఓపెన్ ఎగ్జామినేషన్ సిస్టంలో 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఈ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే చౌతాలా మెట్రిక్యులేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆయన ఫలితాన్ని బోర్డు విడుదల చేయలేదు. దీంతో దానిని పూర్తి చేయడం కోసం ఆయన ఇప్పుడు ఇంగ్లిష్ పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రం వద్ద మీడియా ప్రశ్నలకు చౌతాలా ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : om prakash chautala  haryana former cm  class 10 exam  class 12 exam  English Exam  Haryana  Politics  

Other Articles