SC allows Bengal Commission to probe Pegasus Scandal పెగసెస్ స్కామ్: బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Sc issues notice on plea against bengal commission to probe pegasus scandal

Supreme Court, Pegasus spyware, snooping row, West Bengal government, Journalists, Politicians, Activists, Madan B. Lokur commission, state surveillance, Indian govt surveillance, supreme court pegasus hearing, supreme court pegasus plea, pegasus spyware news, Phone spyware, snooping row, Governent surveillance, Amit Shah, PM Modi, National Politics

The Supreme Court issued notice to West Bengal government on a plea challenging the setting up of a two-member commission of inquiry headed by retired Supreme Court judge, justice Madan B. Lokur, to probe the Pegasus snooping allegations.

పెగసెస్ స్కామ్: కమీషన్ ఏర్పాటుపై బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Posted: 08/18/2021 09:58 PM IST
Sc issues notice on plea against bengal commission to probe pegasus scandal

పెగాసస్ స్కామ్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. దేశంలోని ప్రముఖులు, న్యాయమూర్తులు, సంపాదకులు, పాత్రికేయులు, జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ వేత్తలు.. యాక్టివిస్టుల ఫోన్ కాల్ లపై కేంద్రం నిఘా పెట్టిందన్న అరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేకెత్తించాయి. ఈ క్రమంలో వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కూడా ఈ అంశం స్థంభింపజేసింది. అంతేకాదు విపక్ష నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలోనూ దోహదం చేసింది. ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం వినియోగించాల్సిన ఈ సాప్ట్ వేర్ తో దేశంలోని ప్రముఖలను కేంద్రం టార్గెట్ చేసిందన్న అరోపణలు పెద్దఎత్తున వినిపించాయి.

పెగాసస్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడం, విచారణ జరిపించకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపి పక్ష నేత సువేందు అధికారి బెంగాల్ లోని ఓ ఎస్సీ స్థాయి అధికారిపై చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న బెంగాల్ లోని మమత ప్రభుత్వం.. పెగసెస్ కుంభకోణంపై దేశ సర్వోన్నతనన్యాయస్థానానికి చెందిన మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ నేతృత్వంలో ద్విసభ్య కమీషన్ వేసింది. ఈ కమీషన్ పెగసెస్ అంశంపై విచారణ జరుపుతోంది.  

ఈ నేపథ్యంలో, ద్విసభ్య కమిషన్ విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ఇద్దరు సభ్యుల కమిషన్ విచారణను నిలుపుదల చేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చింది. మరోవైపు కమిషన్ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పెగాసస్ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిల్ పై విచారణ జరుపుతామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles