Madras high court issues directions to ‘release caged parrot CBI’ సీబిఐని విడుదల చేయాలంటూ మద్రాస్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Madras high court issues directions to release caged parrot cbi

Central Bureau of Investigation (CBI), madras high court, cbi, madras high court, supreme court, High Court, Tamil Nadu, Parliament, prime minister, Union Government, Crime

The Madras high court asked the Centre to consider enacting a law giving statutory status to the Central Bureau of Investigation (CBI) to ensure its autonomy without the government’s administrative control. It was part of a slew of directions the court issued for improving the CBI functioning as part of an attempt to “release the caged parrot”.

‘పంజరంలో చిలుకలైన సీబిఐని.. వదిలేయండి’: మద్రాస్​ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Posted: 08/18/2021 08:59 PM IST
Madras high court issues directions to release caged parrot cbi

సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంజరంలో రామచిలుకలా సీబీఐ మారిపోయిందని, వెంటనే దానిని విడుదల చేయాలని ఆదేశించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మలా మారిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాదిరిగానే సీబీఐ కూడా స్వతంత్ర సంస్థలా ఉండాలని, అది కేవలం పార్లమెంట్ కే రిపోర్ట్ చేయాలని సూచించింది.

‘‘సీబిఐ కేంద్ర ప్రభుత్వం చేక్కుచేతల్లో నడుస్తోంది.. దాని పరిస్థితి పంజరంలో రామచిలుకలా మారింది.’’ ఒకప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీబిఐపై చేసిన వ్యాఖ్యలివి. అయితే ఈ వ్యాఖ్యలను మరోమారు పునరుద్ఘాటన చేసింది మరో న్యాయస్థానం. తమిళనాడు రాష్ట్రోన్నతన న్యాయస్థానం మద్రాసు హైకోర్టు తాజాగా ఇవే వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు వెంటనే దానిని పంజరం నుంచి విడుదల చేయాలని అదేశిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పంజరంలోని రామచిలుకను వెంటనే విడుదల చేయాలంటూ కేంద్రాన్ని అదేశించింది మద్రాసు హైకోర్టు.

తమిళనాడులో జరిగిన 'పోంజీ' స్కామ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఎన్. కిరుబాకరన్, జస్టిస్ బి. పుగళెందిల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే ఆ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ వ్యవస్థలో మార్పులకు కోర్టు 12 పాయింట్ల నిర్మాణాత్మక సూచనలను చేసింది. సీబీఐకి చట్టబద్ధ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘వీలైనంత త్వరగా సీబీఐ అధికారాలు, పరిధులు పెంచి.. సంస్థకు చట్టబద్ధ హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని చేయాలి. సీబీఐపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చూడాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

డీవోపీటీకి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి లేదా మంత్రికే రిపోర్ట్ చేసేలా కార్యదర్శి స్థాయి హోదాను సీబీఐ డైరెక్టర్ కు ఇవ్వాలని ఆదేశించింది. ఎక్కువ మంది సిబ్బంది లేరని పోంజీ స్కామ్ కేసును బదిలీ చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సంస్థలో వెంటనే కేడర్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. నెలలోపు నియామకాలు చేపట్టాలని సూచించింది. అమెరికా ఎఫ్ బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ లాగా సీబీఐని బలోపేతం చేయాలని, అందుకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cbi  madras high court  supreme court  High Court  Tamil Nadu  Parliament  prime minister  Union Government  Crime  

Other Articles