5 Indian-origin women in 2021 Forbes list ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భార‌త సంత‌తి మ‌హిళ‌లు

5 indian origin women in 2021 forbes list of america s richest self made women

forbes list, self-made women, 'America’s Richest Self Made Women', indian origin woman, Pepsico, Indra Nooyi, Neerja Sethi, co-founder, Syntel, Neha Narkhede, co-founder Confluent, Jayshree Ullal, president and CEO of Arista Networks, Reshma Shetty, co-founder of Gingko Bioworksm business, economy

The Forbes list of America’s Richest Self-Made Women featured five women of Indian origin including Pepsico’s former chairman and CEO Indra Nooyi, Neerja Sethi, co-founder, Syntel, Neha Narkhede, co-founder and former chief technology officer of Confluent, Jayshree Ullal, president and CEO of Arista Networks and Reshma Shetty, co-founder of Gingko Bioworks.

ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భార‌త సంత‌తి మ‌హిళ‌లు

Posted: 08/12/2021 02:12 PM IST
5 indian origin women in 2021 forbes list of america s richest self made women

అగ్ర‌రాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో (Forbs list) ఆ ఐదుగురు ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో అరిస్టా నెట్‌వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలిచారు. ఉల్లాల్ అరిస్టా నెట్ వర్క్స్ లో ఐదు శాతం వాటాదారుగా వున్నారు. దీంతో పాటు 2020లో పబ్లిక్ లిస్టింగ్ కు వెళ్లిన క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ లోనూ అమె స్థానం సంపాదించారు. ఉల్లాల్ సాన్ ఫ్రాన్ సిక్కో రాష్ట్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత శాంటాక్లాజ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ కోర్పును పూర్తి చేశారు.

సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. ఒక‌ బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. తన భర్త భరత్ దేశాయ్ తో కలసి అమె ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ ను ట్రాయ్ లో స్థాపించారు. మెచిగన్ లోని ఓ అపార్టుమెంటులో సంస్థను స్థాపించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన సేథి.. ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటక్ ఎస్ఈ నుంచి  మిలియన్ డాలర్ల వాటాను కూడా కలిగివుంది. కాన్ ఫ్లుయెంట్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు, మాజీ చీఫ్ టెక్నాల‌జీ అధికారి నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్ల సంప‌ద‌తో జాబితాలో 29వ స్థానంలో నిలిచింది. ఈమె ఫూణే యూనివర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేసి.. జార్జియా టెక్ నుంచి మాస్టార్స్ పట్టాను అందుకున్నారు.

జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో 39వ స్థానంలో ఉన్నారు. అమె స్థాపించిన బయో టెక్నాలజీ కంపెనీ అటు డాటా అనాలటిక్స్ తో పాటు రోబోటిక్స్ ను  వినియోగించి నూతన అర్గనిసమ్స్ నూతన అవిష్కరణలు, కనుగోనుటను వేగవంతం చేశారు. ప్సికో సంస్థ సీఈఓ ఇంద్రా నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు. కాగా గ‌త 12 ఏళ్లుగా పెప్సికో చైర్మన్ అండ్ సీఈవో గా వ్యవహరించిన ఇంద్రానూయి.. తాజాగా పెప్సీకో నుంచి వీడి పర్యావరణ హిత, అరోగ్యవంతమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles