Weapons purportedly used in Viveka’s murder seized వైఎస్ వివేక హత్యకేసులో సీబిఐ చేతికి ఆయుధాలు..

Ys viveka murder case cbi sleuths raid on the houses of suspects seizes weapons

CBI, murder case, Vivekananda, Rangaiah, servent, Weapons, Sunil Kumar Yadav, Financial grudge, Bank staff, Revenue Employees, CBI officials, Kadapa Central Jail, Murder case, CBI custody, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The CBI officials conducted intensive searches at the homes of suspects in connection with the murder case of former minister YS Vivekananda Reddy. The suspects and three SBI officials were interrogated at a guest house in Kadapa Central Jail.

వైఎస్ వివేక హత్యకేసులో ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సీబిఐ

Posted: 08/12/2021 03:14 PM IST
Ys viveka murder case cbi sleuths raid on the houses of suspects seizes weapons

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓ వైపు అరెస్టు పర్వం కొనసాగిస్తున్న సీబీఐ.. మరోవైపు కేసులో వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణ వేగవంతం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. రహస్యంగా ఆయుధాల కోసం వేట కొనసాగించిన సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రానికి ఈ పనిపూర్తిచేశారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రొద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

సోదాల సందర్భంగా ఇంట్లో అవసరాలకు వాడే కొన్నిరకాల వస్తువులు, వ్యవసాయ పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా రోటరీపురం, గారండాల వాగు దగ్గర 26 మంది మున్సిపల్ సిబ్బందితో మూడు రోజుల పాటు ఆయుధాల కోసం తవ్వకాలు జరపగా జాడ దొరకలేదని అన్వేషణ ఆపేసినట్లుగా ప్రకటించారు. కానీ.. అనూహ్యంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం హైడ్రామాగా మారింది. దీంతో పాటు కర్ణాటక నుంచి 20 మంది బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కడపకు వచ్చి సీబీఐ అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివేకా హత్యకేసుకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోండగా ఈ కోణంలోనే ఇప్పటికే బలమైన ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వ్యవసాయానికి వాడే కత్తులు, కొడవళ్ళను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ యాదవ్ బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా కూడా వెంట తీసుకెళ్లగా పంచనామా నిర్వహించి, సునీల్ తండ్రికి వస్తువుల జాబితా అందజేశారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇళ్లలో కూడా తనిఖీలు చేయగా అక్కడ నుండి కూడా కొన్ని పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles