Rahul Gandhi holds march towards Vijay Chowk పార్లమెంటుకు విపక్షాల ర్యాలీ.. ‘‘ప్రజాస్వామ్యం ఖూనీ’’ అని వ్యాఖ్య

Outsiders brought in to manhandle mps including women opposition

Rahul Gandhi, Rahul Gandhi parliament, Opposition protests, Rahul gandhi parliament protests, Opposition Parliament Protest, Parliament Monsoon Session, Parliament, Monsoon session, Opposition parties, Marshals, Women Parliamentarians, Vijay chowk Rally, National Politics

Congress MP Rahul Gandhi and nearly a dozen other opposition leaders gathered outside Parliament today to protest an abrupt end to the monsoon session and the alleged assault on women MPs. They alleged "outsiders who were not part of Parliament security were brought in to manhandle opposition leaders and members, including women MPs".

ITEMVIDEOS: పార్లమెంటుకు విపక్షాల ర్యాలీ.. ‘‘ప్రజాస్వామ్యం ఖూనీ’’ అని వ్యాఖ్య

Posted: 08/12/2021 01:12 PM IST
Outsiders brought in to manhandle mps including women opposition

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇవాళ ప్ర‌తిప‌క్ష పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అర్థాంతరంగా ముగించేసిన తీరుపై నిరసనను వ్యక్తం చేసిన విపక్షాలు ఇవాళ విజ‌య్ చౌక్ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు ర్యాలీగా తరలివెళ్లారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటు ఉభయసభల్లో ప్రజాప్రతినిధులపై చేయిచేసుకున్న ఘటనలపై విపక్షాలు తివ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేత‌లు పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వమే ఖూనీ చేయడమేనని అరోపించాయి.

పార్ల‌మెంటు ఉబయసభల్లో విప‌క్ష నేతల గొంతును ప్ర‌భుత్వం నొక్కి పెట్టింద‌ని, దీంతో పార్లమెంటులో మాట్లాడే అవకాశం లేనందునే ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న బాట‌ప‌ట్టిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యసభలో భీమా బిల్లును అడ్డుకునే క్రమంలో వెల్ లోకి దూసుకువచ్చి విపక్ష ఎంపీలతో పాటు మహిళా ఎంపీలపై భౌతికంగా దాడి చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు. రాజ్యసభలోని విపక్ష ఎంపీలపై దాడులు చేసేందుక పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది కాని భయటివారిని కూడా సభలోకి రానిచ్చారని ఆయన అరోపించారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పిర్యాదు విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిశాయ‌ని, 60 శాతం దేశ జ‌నాభా అస‌లు పార్ల‌మెంట్ సెష‌న్ జ‌ర‌గ‌లేద‌న్న అభిప్రాయంలో ఉంద‌ని, 60 శాతం మంది ప్ర‌జ‌ల గొంతును నొక్కిపెట్టార‌న్నారు. రాజ్య‌స‌భ‌లో బుధ‌వారం మ‌హిళా ఎంపీల ప‌ట్ల మార్ష‌ల్స్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తెలిపారు. తాము పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్నా.. తమను పాకిస్తాన్ బోర్డ‌ర్ లో నిల‌బ‌డిన‌ట్లుగా ఉంద‌న్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత మల్లిఖార్జున్ ఖార్గే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్, మనోజ్ ఝా సహా పలువురు విపక్ష నేతలు పాల్గోన్నారు.

కాగా, పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ముందుగా వాయిదా వేసిన ఘ‌ట‌న‌లో ప్ర‌తిప‌క్షాలు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రులు డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్‌లో త‌మ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తాల‌ని ప్ర‌జ‌లు ఎదురు చూస్తార‌ని, కానీ విప‌క్షాలు అరాచ‌కాన్ని సృష్టించాయ‌ని, వాళ్లు ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ప‌న్నుదారుడి సొమ్ము వృధా అయ్యింద‌ని మంత్రులు విమర్శించారు. రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఖండిస్తున్నామ‌ని, మొస‌లి క‌న్నీళ్లు ఆపేసి, విప‌క్షాలు దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రులు డిమాండ్ చేశారు. బిల్లులు పాస‌వుతున్న తీరును విప‌క్షాలు జీర్ణించుకోలేక‌ పోతున్నాయ‌ని మంత్రులు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles