Shilpa Shetty, Raj Kundra fined Rs 3 lakh by SEBI ఇన్సైడర్ ట్రేడింగ్: రాజ్ కుంద్రా, శిల్పాశెట్టీలకు సెబి జరిమానా.!

Insider trading shilpa shetty raj kundra and viaan industries fined rs 3 lakh by sebi

Raj Kundra, shilpa shetty, Viaan Industries, insider trading rules, SEBI, adjudicating officer, Suresh B Menon, Shilpa Shetty, pornography, mumbai crime branch, Raj Kundra Latest News, Pornography Case News, Raj Kundra sent to Police Custody, Raj Kundra Police Custody, Raj Kundra arrested, shilpa shetty husband arrested, shilpa shetty husband case, raj kundra porn racket, Crime

The SEBI has imposed a penalty of Rs 3 lakh on Bollywood actor Shilpa Shetty Kundra, her businessman husband Raj Kundra and their company Viaan Industries for violating insider trading rules. Kundra, Shetty and Viaan have been fined for a three-year delay in the disclosure of an allotment of preferential shares.

ఇన్సైడర్ ట్రేడింగ్: రాజ్ కుంద్రా, శిల్పాశెట్టీలకు సెబి జరిమానా.!

Posted: 07/29/2021 03:52 PM IST
Insider trading shilpa shetty raj kundra and viaan industries fined rs 3 lakh by sebi

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త.. వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరోషాక్ తగిలింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రాజ్ కుంద్రా, శిల్పాశెట్టితో పాటు వారి కంపెనీ వియాన్ ఇండస్ట్రీస్ కి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే అభియోగాలపై వారికి ఈ మేర జరిమానా విధించింది. సెబి విధించిన ఫైన్ ను 45 రోజుల వ్యవధిలో వీరు కట్టాల్సిందిగా సెబి అదేశించింది. దీంతో ఇప్పటికే ఫోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్న కుంద్ర కుటుంబంపై మరో పిడుగుపడినట్లు అయ్యింది.

భర్త నీలిచిత్రాల కేసులో.. తనకు ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్న శిల్పకు.. సెబి ఇచ్చిన షాక్ కూడా గట్టిగా తగిలింది. వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)కు సంబంధించి 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ట్రేడింగ్/డీలింగ్ పై విచారణ జరిపామని సెబీ తెలిపింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, వియాన్ ఇండస్ట్రీస్ లు సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రెగ్యులేషన్స్ కు సంబంధించిన 7(2)(ఏ), 7(2)(బీ)లను అతిక్రమించారనే విషయం విచారణలో తేలిందని ప్రకటించింది.

2015లో తమ సంస్థకు చెందిన 5 లక్షల ఈక్విటీ షేర్లను నలుగురు వ్యక్తులకు ప్రిఫరెన్సియల్ అలాట్ మెంట్ ద్వారా కేటాయిస్తున్నామని వియాన్ ఇండస్ట్రీస్ తెలిపిందని... వీటిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు 1,28,800 షేర్ల వంతున అలాట్ చేసిందని సెబీ వెల్లడించింది. అయితే, సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ నిబంధన 7(2)(ఏ) ప్రకారం... రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే... రెండు ట్రేడింగ్ దినాల్లోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు ప్రమోటర్లు అందజేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే వీరు ఆ పని చేయలేదని వ్యాఖ్యానించింది. శెట్టి, కుంద్రాలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్దారని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles