Key suspect in YS Viveka case goes absconding! వైఎస్ వివేక హత్యకేసులో కీలక అనుమానితుడు అదృశ్యం..

Ys vivekananda reddy murder case cbi search on for key suspect

CBI, murder case, Vivekananda, Rangaiah, servent, 45 days investigation, 1600 persons interogation, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Kadapa central prison, guest house, close aids, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The CBI which has reportedly secured crucial information in the murder case of former Minister and MP YS Vivekananda Reddy, Meanwhile the key suspect in the case, the close follower of Vivekananda Reddy, who approached High court is absconding, the cbi sleuths search operations are on.

వైఎస్ వివేక హత్యకేసు: కీలక అనుమానితుడు అదృశ్యం..

Posted: 07/29/2021 02:50 PM IST
Ys vivekananda reddy murder case cbi search on for key suspect

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరుకుంది. వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తులో ఇప్పటికే 47 రోజులుగా సమగ్ర విచారణ జరిపిన సీబిఐ అధికారులు.. మరొ రెండు మూడు రోజుల్లో ఈ కేసులో చార్జిషీటును న్యాయస్థానంలో సమర్పించేందుకు రెడీ అయ్యారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన ఇంటి వాచ్ మన్‌ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇందుకు సంబంధించి సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది.

కాగా ముగ్గురు కీలక నిందితుల పేర్లు బయటకు రావడంతో.. సీబిఐ అధికారులు విచారణ పేరుతో తనను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ధర్డ్ డిగ్రీ పద్దతులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇలా అయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మరుసటి రోజు నుంచి అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో తన ఇంటికి తాళం వేసిన కీలక అనుమానితుడు సునీల్ కుమార్ యాదవ్ తన కుటుంబంతో పాటు కనిపించకుండాపోయాడు. ఆయన ఇంటికి తాళం వేసి ఉంది, దీంతో సీబిఐ అధికారులు కూడా ఆయన జాడ కోసం బంధువులను వాకాబు చేస్తున్నారు.

ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా, వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఐపీసీ సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరును కూడా వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles