CCTV footage of Dhanbad judge’s Murder emerges జీపుతో ఢీకొట్టించి జడ్జి హత్య.. సిసీటీవీలో దాగిన నిజం..

Cctv of jharkhand judge s murder spurs outrage raised in supreme court

Uttam Anand, Judge, jharkhand judge murdered, dhandbad judge murder, Jharkhand Accident, Jharkhand judge, dhandbad judge, special investigation team (SIT), CCTV footage, Supreme Court, CJI NV Ramana, Dhandbad, Jharkhand, crime

A special investigation team (SIT) has been constituted in Jharkhand to investigate the death of a judge who was hit by a three-wheeler. Additional sessions and district judge Uttam Anand was out for his daily morning jog when a three-wheeler hit him.

ITEMVIDEOS: జీపుతో ఢీకొట్టించి జడ్జి హత్య.. సిసీటీవీలో దాగిన నిజం..

Posted: 07/29/2021 04:45 PM IST
Cctv of jharkhand judge s murder spurs outrage raised in supreme court

జార్ఖండ్ లో సత్యం సమాధి చేయడానికి దుండగులు యత్నించారు. అయితే సిసిటీవీ ఫూటేజీ రూపంలో నిక్షిప్తమైన నిజం.. న్యాయమూర్తి ప్రమాదం బారిన పడలేదని, అది నూటికి నూరుశాతం హత్యేనని తేల్చింది. ఉద‌యాన్ని జాగింగ్ కు వెళ్లిన ఓ డిస్ట్రిక్ట్ అండ్ అడిష‌నల్ జ‌డ్జి హ‌త్యకు గురయ్యారు. బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా మొద‌ట దీనినో ప్ర‌మాదంగానే అంద‌రూ భావించారు. హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదు చేశారు. అయితే తాజాగా బ‌య‌ట‌ప‌డిన సీసీటీవీ ఫుటేజీ ఇది హ‌త్యేన‌ని తేల్చింది.

జార్ఖండ్ లోని ధ‌న్‌బాద్ జిల్లా జ‌డ్జిగా ఉన్న ఉత్త‌మ్ ఆనంద్ బుధ‌వారం ఉదయం 5 గంట‌ల స‌మ‌యంలో తన ఇంటి నుండి జాగింగ్‌ చేసుకుంటూ బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనను ఫాలో అవుతూ వెనక నుంచి వేగంగా వ‌చ్చిన టెంపో ఆయ‌న‌ను కావాలనే ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపో డ్రైవ‌ర్ కావాల‌నే జ‌డ్జి వైపు వెళ్లి ఢీకొట్టిన‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. దీంతో జడ్జిది హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఇది హిట్ అండ్ రన్ కేసుగా పరిగణించి కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత మార్చారు.

ఈ హ‌త్య‌ను సీరియ‌స్ గా తీసుకున్న చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ ర‌మ‌ణ‌.. జార్ఖండ్ హైకోర్టు జ‌డ్జితో మాట్లాడారు. అంతేకాదు ఈ హ‌త్య చేయ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఆ వాహనాన్ని దొంగిలించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇప్ప‌టికే ఆ డ్రైవ‌ర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ ఇంటి నుంచి బయలుదేరి అరకిలోమీట‌రు దూరం చేరుకునే లోపే ఆయనను వాహ‌నం ఢీకొట్టింది. చాలాసేప‌టి వ‌ర‌కూ ర‌క్తం మ‌డుగులో ఆయ‌న అలా రోడ్డుమీదే ప‌డి ఉన్నారు. త‌ర్వాత ఓ వ్య‌క్తి గ‌మ‌నించి హాస్పిట‌ల్ కు తీసుకెళ్లగా.. అక్క‌డ ఆయ‌న మ‌ర‌ణించారు.

పోలీసులు గ‌తంలో జడ్జి ఉత్తమ్ ఆనంద్ విచార‌ణ జ‌రిపిన కేసుల‌పై దృష్టి సారించారు. ఆయ‌న ధ‌న్ బాద్‌లో ఎన్నో మాఫియా హ‌త్య‌ల కేసుల‌ను చూస్తున్నారు. ఈ మ‌ధ్యే ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ల‌కు బెయిల్ కూడా నిరాక‌రించారు. ఈ కేసును హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ విచారించనున్నారు. అయితే జడ్జి జాగింగ్ కు వెళ్తారన్న సమాచారం అందుకున్న అగంతకులు ఆయన ఇంటికి చేరువలోనే మాటు వేసి.. ఈ దారుణానికి పాల్పడివుంటారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జడ్జిని హత్యకు కుట్రపన్నిన అగంతకులు ముందుగానే రెక్కి నిర్వహించి వుంటారా అన్న కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh