Komatireddy's Huzurabad Survey: Etela leads with 64% of votes హుజూరాబాద్ ఈటెలదే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్వే..

Komatireddy s huzurabad survey etela leads with 64 of votes

Nalgonda, TRS, Congress, Huzurabad, Survey, Etela Rajender, Munugode, Komatireddy Venkat reddy, Teja Raju, Satyam Ramalinga Raju, KT Rama Rao, anti incumbency votes, komatireddy brothers, congress mla munugode, new Ration cards program, Telangana, Politics

Komatireddy Venkatreddy got the survey done in Huzurabad constituency. He said that as per the survey report, there is an advantage for former Minister Eetela Rajender as 64% of the voters are showing interest in him. He mentioned that the pro-TRS atmosphere is just 30% in the region. He also shared that Congress may get only 5% of votes.

హుజూరాబాద్ ఈటెలదే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్వే..

Posted: 07/29/2021 12:01 PM IST
Komatireddy s huzurabad survey etela leads with 64 of votes

హుజూరాబాద్‌ ఈటెలదేనని.. ఆక్కడ జరగనున్న ఉప ఎన్నికలలోనూ ఈటెల రాజేందర్ గెలుపు తథ్యమని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ లో జరగనున్న ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవానికి ప్రతీకగా తీసుకోవడంతోనే ఆయనకు జనం అండగా నిలిచారని అన్నారు వెంకట్ రెడ్డి. ఇక్కడ పార్టీల మధ్య పోరుగా కాకుండా రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి.. ఈటెల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోచ్చారాయన.

హుజురాబాద్ ఉపఎన్నికలపై ప్రస్తుత తాజా పరిస్థితుల నేపథ్యంలో తాను చేయించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశాలు వున్నాయని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఇక్కడ టీఆర్ఎస్ కు కూడా పెద్దగా ఓట్లు రాలే అవకాశాలు లేవని తన సర్వే తెలిపిందని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలలో ఈటెలకు ఏకంగా 67 శాతం మంది ఓటర్లు బ్రహ్మరథం పట్టనున్నారని, ఇకటీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు.

అయితే, కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు.  తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని ఆరోపించారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huzurabad  Survey  Etela Rajender  Munugode  Komatireddy Venkat reddy  TRS  BJP  Congress  Telangana  Politics  

Other Articles