తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా.. ప్రజలు శాంతి సామరస్యంగా ఉంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు బీటాలు వారేలా కొందరు అమాత్యులు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా వ్యవహరించి క్రమంగా శాసనసభ్యుడిగా, అమాత్యుడిగా ఎదిగిన నేతలకు ప్రజల కష్ట,నష్టాలు బాగా తెలిసివుండాలి.. కానీ వారి వల్లే తమకు ప్రాణహాని పోంచి వుందని, అమాత్యులో లేక అతని బంధువులతో తమకు తీరని నష్టం జరగనుందన్న అందోళనను వెలిబుచ్చారు దంపతులు. అందులోనూ సాక్ష్యాత్తు అమాత్యుల జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం.
ఇదివరకే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని తన అనుచరుల చేత తన భూమిని కబ్జా చేయించారని.. అది తన భూమి అని న్యాయస్థానం కూడా చెప్పినా.. అధికారంతో దానిని అక్రమించారని ఓ బాధితుడు మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పుడు తాజాగా ఓ దంపతులు జంట ఏకంగా హైదరాబాద్ లోని మానవహక్కుల కమీషన్ ను కలసి పిటీషన్ దాఖలు చేసింది. తాము మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు గాను ఆయన కక్ష్యసాధింపు చర్యలు కొనసాగిస్తున్నారని దంపతులు అరోపించారు.
2018 ఎన్నికల సమయంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పై నమోదైన ఓ కేసులో తాము ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని.. అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభమయ్యాయని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (ఎస్‌హెచ్ఆర్‌సీ)ని ఆశ్రయించారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు బెదిరింపులు కూడా అధికమయ్యాయని, తమను చంపేస్తామని వారు హెచ్చరించారని కూడా బాధితులు అరోపించారు.
మంత్రి, ఆయన సోదరుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమపై అక్రమ కేసులు బనాయించి.. అర్థరాత్రి వేళ పోలీసులతో దాడులు చేయిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారని కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి వేళలో ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగాల్లోంచి తీసివేయించారని వాపోయారు. ఇకనైనా వేధింపులు ఆపాలని, లేకుంటే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్‌హెచ్ఆర్‌సీకి ఇచ్చిన ఫిర్యాదులో హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more