High court Gives Relief to Danam Nagender టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో ఊరట

Telangana high court suspends danam nagender s jail term

huge relief to Danam Nagender, High court suspends Danam jail term, TRS MLA guilty, TRS MLA assaulting a person, Nampally Court, Danam Nagender, Khairathabad MLA, Six Months Imprisonment, Assaulting Police man, Rs 1000 Fine, Banjara hills, Hyderabad, Telangana, Crime

In a huge relief to former minister Danam Nagender, Justice G Sridevi of the high court suspended the six-month jail sentence given to him by a trial court hearing cases of legislators. The judge was hearing an appeal filed by the legislator against the order of the trial court.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో ఊరట

Posted: 07/29/2021 01:26 PM IST
Telangana high court suspends danam nagender s jail term

మాజీ మంత్రి, ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటిన్ క్రిమినల్ కోర్టులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆయనకు విధించిన ఆరు నెలల పాటు జైలు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దానం నాగేందర్ దాఖలు చేసిన అప్పీల్ ను విచారణకు స్వీకరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇవాళ దానిపై విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కింది కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సస్పెండ్ చేసింది.

ఈ కేసులో తుది తీర్పు వెల్లడయ్య వరకు జైలు శిక్షను రద్దు చేసింది. ఈ కేసును ఎదుర్కొంటున్న శాసనసభ్యుడు కింది కోర్టు విధించిన షరుతులు, నిబంధనల మేరకు బెయిల్ పై ఉండవచ్చునని తెలిపింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకీ ఏ కేసులో దానం నాగేందర్ కు న్యాయస్థానం జైలు శిక్షను విధించిందో తెలుసా..? తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న సాగుతున్న నేపథ్యంలో ఆయన కారుకు అడ్డుగా వెళ్లిన ఎస్.సాంబశివరావు అనే వ్యక్తిని కర్రతో కొట్టి దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

దీంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2013లో బంజారాహిల్స్ లో నమోదైన కేసులో దానం నాగేందర్ దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది. తన కారుకు అడ్డుగా వెళ్లిన వ్యక్తిపై ఆయన దాడి చేసి గాయపరిచారన్న కేసులో అభియోగాలు రుజువయ్యాయి. కాగా న్యాయస్థానం తమ తీర్పుపై దానం నాగేందర్ పై కోర్టులకు వెళ్లేందుకు.. అప్పీల్ చేసుకోవడంతో రాష్ట్రోన్నత న్యయస్థానం ఈ శిక్షను కేసు తుది తీర్పు వెల్లడయ్యేంత వరకు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles