Pegasus row: Anil Ambani, CBI ex-director on list పెగసస్ జాబితాలో అంబానీ, ఏకే శర్మ, అలోక్ శర్మ నెంబర్లు

Pegasus row anil ambani dassault s rep and the india head of french energy firm edf

Ashwini Vaishnaw, IT minister on Pegasus report, pegasus hack, Pegasus snooping row, Industrialist Anil Ambani, former CBI Director Alok Verma, CBI senior officers Rakesh Asthana, AK Sharma, Reliance ADA, Tony Jesudan, French company Dassault, Dassault Aviation India rep venkata rao posina, West Bengal Pegasus spyware issue, Pegasus issue, Suvendu Adhikari, Abhishek Banerjee, Pegasus, Amit Shah, PM Modi, National Politics

Phones used by industrialist Anil Ambani, former CBI Director Alok Verma, and two other senior officers at the agency — former special director Rakesh Asthana and former additional director A K Sharma — were potential targets of surveillance using the Pegasus spyware, according to a report published by The Wire.

పెగసస్ జాబితాలో అంబానీ, ఏకే శర్మ, అలోక్ శర్మ నెంబర్లు

Posted: 07/23/2021 02:07 PM IST
Pegasus row anil ambani dassault s rep and the india head of french energy firm edf

ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్న వార్త కథనంతో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతేకాదు ఈ వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న విపకాల డిమాండ్ కు రానురాను బలం పెరుగుతోంది. దీంతోపాటు పెగసెస్ హ్యాకింగ్ ఘటనపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెగాసెస్ స్పైవేర్ పై అట్టుడికిపోతున్న తరుణంలో తాజాగా తెరపైకి కొత్త కథనాలు వస్తున్నాయి,

తాజాగా పెగాసస్ విషయంలో అనిల్ అంబానీ పేరు తెరమీదకు వచ్చింది. ట్యాపింగ్ చేసేందుకు ఫోకస్ పెట్టిన ఫోన్ల నెంబర్ల జాబితాలో రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీకి చెందిన నెంబర్లు ఉన్నాయంటూ ‘ది వైర్‌’ రాసుకొచ్చింది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్‌కు ఇండియన్ పార్టనర్ గా అనిల్‌‌కు చెందిన సంస్థను ఎంపిక చేశారని… దాని వెనుక ఆయన్ను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం ఉందని ఆరోపణలు వచ్చాయి.

నిఘా జాబితాలో డసాల్ట్‌ ఏవియేషన్‌ భారత ప్రతినిధి వెంకటరావు పోసీన, బోయింగ్‌ ఇండియా బాస్‌ ప్రత్యూష్‌ కుమార్‌ నెంబర్లు ఉన్నాయని వైర్‌ వెల్లడించింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై కూడా నిఘా కొనసాగిందని వైర్‌ వెల్లడించింది. గురువారం.. ప్రభుత్వంతో విభేదాల అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను 2018లో పదవిలో నుంచి తొలగించగానే ఆయన ఫోన్ పైనా నిఘా పెట్టారు. ఈ పెగాసస్ స్కాండల్ ను వాటర్ గేట్ కంటే పెద్దదిగా అభివర్ణిస్తుంది ప్రతిపక్షం. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, డజన్ల కొద్దీ జర్నలిస్టులు ఈ నిఘా జాబితాలో ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles