wife secretly films husband illicit affair make viral భర్త రాసలీలలను భయటపెట్టిన భార్య.. నెట్టింట్లో పెట్టి వైరల్

Wife secretly films husband illicit affair make viral on social media

wife red-handedly catches husband illicit affair, wife secretly shoots husband extramarital affair, wife catches husband with another woman, wife catches husband with mistress, Teacher wife, husband, CRPF Jawan, Extramarital affair, illicit affair, husband nude video, social media, jaipur, rajasthan, viral video

Teacher wife makes husband video goes viral on social media after following him to lodge and secretly films his illicit affair with another woman in Jaipur lodge. Teacher's husband a CRPF Jawan is residing in Rajasthan.

భర్త రాసలీలలను భయటపెట్టిన భార్య.. నెట్టింట్లో పెట్టి వైరల్

Posted: 07/23/2021 03:20 PM IST
Wife secretly films husband illicit affair make viral on social media

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పరస్త్రీ లక్ష్మితో సమానమని.. వారిని తేడాగా చూడటమే పాపమని హైందవ ధర్మాలు చెబుతున్నా పరాయి మహిళలో మోజులో కట్టుకున్న సహదర్మచారిణికి అన్యాయం చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతూనే వుంది. వివాహేతర సంబంధాలతో చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు మంచివి కాదని తెలిసినా ఇంకా కొందరు పెడదోవ పడుతూనే ఉన్నారు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు నడుపుతున్న భర్తకు ఓ భార్య గట్టిగా బుద్ది చెప్పింది. భర్తను వెంబడించిన అమె.. ఆయన వెంటే లాడ్జికి చేరుకుంది.

భర్త తన ప్రేయసితో లాడ్జిలో నగ్నంగా ఉన్న సమయంలో వారి నూడ్ వీడియోలు తీసి వైరల్ చేసింది. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య స్కూల్ లో టీచర్. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడే వాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని గుర్తించింది. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్ లో మాట్లాడుతూ.. లాడ్జికి రమ్మని తన ప్రేయసికి చెప్పాడు.

ఇది తెలుసుకున్న భార్య కాసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సాయంతో తాళం తెరచి చూడగా భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను ఆమె వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ తాను తీసిన వీడియోను పలువురికి పంపింది. అంతే అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి వాపోయింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు తీసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles