IED-laden drone shot down near LOC in Jammu Kashmir జమ్మూలో మరోసారి డ్రోన్ సంచారం.. నేలకూల్చిన భద్రతాబలగాలు..

Terror attack foiled jk police shoots down drone carrying ied material

drone shot down, drone spotted, Jammu drone, drone shotdown Akhnoor, drone shot down Beri pattan, Jammu drone shot down, BSF, Drone activity in Jammu Kashmir, drone shot down in Jammu, Pakistan, drone, 5 kilo IED, Terror attack foiled, drone shot down, Jammu police, LIne of control, Gurah pattan, Akhnoor, Jammu Kashmir

A drone carrying around 5 kilograms of improvised explosive device (IED) was shot down early on Friday by Kashmir Police in Akhnoor’s Gurah Pattan area near the Line of Control. This comes weeks after a drone had dropped explosives on an Air Force base in Jammu.

జమ్మూలో మరోసారి డ్రోన్ సంచారం.. నేలకూల్చిన భద్రతాబలగాలు..

Posted: 07/23/2021 01:14 PM IST
Terror attack foiled jk police shoots down drone carrying ied material

జమ్మూకశ్మీర్ లో మరోమారు డ్రోన్ సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఎనమిదవ డ్రోన్ భారత్ లో సంచరించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది, జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై నిన్న డ్రోన్ సంచరించడంతో అప్రమత్తమైన బధ్రతాబలగాలు ఇవాళ ఉదయం మరోమారు భారత సరిహద్దు భూబాగంలో సంచరించిన డ్రోన్ జమ్మూ పోలీసులు దాడి జరిపి నేలకూల్చారు. కాగా, ఈ డ్రోన్ ద్వారా ఉగ్రవాదులు మరోమారు భారత్ లో విద్వంసం సృష్టించాలని కుట్ర చేయగా దానిని జమ్మూ పోలీసులు భగ్నం చేశారు.

ఇవాళ జమ్ములో నెలకూల్చిన డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న ఈ రోజు తెల్ల‌వారుజామున‌ జమ్మూలోని సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలోని అక్నూర్ ప్రాంతానికి చేరువలోని గుర్హ పఠానిలో చోటు చేసుకుంది. డ్రోన్‌లో ఐదు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయ‌ని, వాటిని స్వాధీనం చేసుకున్నామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. స్వాధీనం చేసుకున్న ఈ ఐడీఈ పదార్థాలను తరువాత కాల్చివేశామని పోలీసులు తెలిపారు. ఈ డ్రోన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. 2019 నుంచి పాక్ భార‌త్‌లోకి డ్రోన్ల ద్వారా పేలుడు ప‌దార్థాలు, డ్ర‌గ్స్ పంపే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.

ఇటీవ‌ల జమ్మూ ఎయిర్‌ బేస్‌లో చోటు చేసుకున్న డ్రోన్‌ దాడి నేపథ్యంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు డ్రోన్ల‌పై నిఘా పెంచాయి. డ్రోన్ల‌ను రాడార్లు, యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్ సాయంతో గుర్తించి పాక్ చ‌ర్య‌ల‌ను భార‌త సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని డ్రోన్లు త‌ప్పించుకుని వెన‌క్కి వెళ్లిపోతున్నప్ప‌టికీ కొన్నింటిని మాత్రం భార‌త సైన్యం కూల్చేయ‌గ‌లుగుతోంది. డ్రోన్ల ద్వారా జ‌రిగే దాడుల‌ను ముందుగానే ప‌సిగ‌ట్టి తిప్పి కొట్టేందుకు ఏర్పాటు చేసుకుని అప్ర‌మ‌త్తంగా ఉంది. అయితే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ప్రభుత్వ సహకారం పూర్తిగా లభిస్తోందని భారత అర్మీ వర్గాలు అరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles